న్యూస్ బాక్స్ ఆఫీస్

వరల్డ్ ఫేమస్ లవర్ డే 2 ఓపెనింగ్స్….షాకింగ్ ఓపెనింగ్స్!

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజే అంచనాలను తప్పేసింది, సినిమా అనుకున్న రేంజ్ వసూళ్ళ ని అందుకోవడం లో విఫలం అవ్వగా మొత్తం మీద 6 కోట్ల రేంజ్ వసూళ్లు అనుకుంటే 4.4 కోట్ల రేంజ్ షేర్ తోనే రెండు తెలుగు రాష్ట్రాలలో సరిపెట్టుకుంది ఈ సినిమా. ఇక వరల్డ్ వైడ్ గా 8 కోట్లకు పైగా అనుకుంటే 5.53 కోట్ల షేర్ ని అందుకుని షాక్ ఇచ్చింది.

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు కూడా సినిమా షాక్ ల పర్వం కొనసాగింది, సినిమా మొదటి రోజు తో పోల్చితే ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో 40% వరకు డ్రాప్స్ రెండో రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు కనిపించాయి.

దాంతో సినిమా ఇప్పుడు రెండో రోజే భారీ షాక్ ఇచ్చే కలెక్షన్స్ ని అందుకునేలా ఉంది, ఈవినింగ్ అండ్ నైట్ షోలకి గ్రోత్ చూపక పొతే సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో రెండో రోజు 2 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి. సినిమా సాధించిన బిజినెస్ దృశ్యా ఇది…

భారీ డ్రాప్స్ గా చెప్పుకోవాలి, కానీ కొన్ని సెంటర్స్ లో ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ బాగుండటం తో సినిమా కొంచం బెటర్ గా పికప్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పాలి. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ మాత్రం మాస్ సెంటర్స్ లో అయితే ఆశించిన విధంగా అయితే లేవు.

కానీ సినిమా కొంచం గ్రోత్ చూపినా 2.2 కోట్ల రేంజ్ లో షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించవచ్చు. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఈ ఓపెనింగ్స్ ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి. రోజు ముగిసే సరికి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి..

Leave a Comment