న్యూస్ బాక్స్ ఆఫీస్

వరల్డ్ ఫేమస్ లవర్ ఫస్ట్ డే ఓపెనింగ్స్…సెన్సేషనల్ ఓపెనింగ్స్!!

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ 3 – 4 రోజుల ముందే మొదలు అయ్యాయి, రెస్పాన్స్ పర్వాలేదు అనిపించే విధంగా మొదలు అవ్వగా రిలీజ్ ముందు రోజు వరకు మొత్తం మీద 30% వరకు ప్రీ బుకింగ్స్ ని సొంతం చేసుకున్న సినిమా రిలీజ్ రోజు సమయానికి మొత్తం మీద 40%  నుండి 45% రేంజ్ లో బుకింగ్స్ తో ఓపెన్ అయింది.

సినిమా మొదటి రోజు ఓపెనింగ్స్ క్లాస్ అండ్ మల్టీ ప్లేక్సులలో అద్బుతంగా ఓపెన్ అవ్వగా మాస్ సెంటర్స్ లో మాత్రం జస్ట్ ఓకే అనిపించే రేంజ్ లో ఓపెన్ అయింది ఈ సినిమా. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ మాత్రం బాగున్నాయని చెప్పొచ్చు.

దాంతో సినిమా మొదటి రోజు సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం ఖాయం, వాలెంటైన్స్ డే అడ్వాంటేజ్ ఉన్నా ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో సాలిడ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోబోతుంది ఈ సినిమా. మొత్తం మీద మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల ఆక్యుపెన్సీ 50% టు 55% రేంజ్ లో ఉండటం తో..

సినిమా ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాలలో 5.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది, ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ బాగుండటం తో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా అనుకున్న రేంజ్ లో ఉంటె మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో అవలీలగా 6 కోట్ల రేంజ్ లో…

షేర్ ని సినిమా సొంతం చేసుకునే అవకాశం గట్టిగా ఉంది. ముందే చెప్పినట్లు ఫిబ్రవరి నెలలో ఇది సెన్సేషనల్ ఓపెనింగ్స్ అని చెప్పాలి. అది కూడా డిసాస్టర్ తర్వాత ఒక అర్బన్ లవ్ స్టొరీ తో విజయ్ దేవరకొండ దుమ్ము లేపే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోబోతున్నాడు. రోజు ముగిసే సరికి స్టేటస్ ని బట్టి ఈ లెక్క పెరిగే అవకాశం కూడా ఉంది.

Leave a Comment