న్యూస్ స్పెషల్

వరల్డ్ సినిమా ఔట్…నంబర్ 1 కలెక్షన్స్ తో చైనా సినిమా 2020 టాపర్!!

కరోనా వలన వరల్డ్ సినిమా ఈ ఏడాది కి తేరు కోలేని దెబ్బ పడింది, ఒక్కో దేశం కరోనా వల్ల ఇబ్బంది పడుతూ థియేటర్స్ మూసేస్తూ టోటల్ గా వరల్డ్ థియేటర్స్ దాదాపుగా 6 నెలల నుండి మూసేసి ఉండగా ఈ కరోనా ని వరల్డ్ కి పరిచయం చేసిన కారణంగా చైనా ని తిట్టుకోని సినీ అభిమాని సాధారణ పౌరుడు లేడనే చెప్పాలి. ఇలా అందరితో తిట్టించుకున్న చైనా లో కూడా…

లాస్ట్ ఇయర్ ఎండ్ నుండి థియేటర్స్ మూత పడగా ఈ ఇయర్ సమ్మర్ టైం లో తిరిగి థియేటర్స్ ని తెరిచారు, అప్పటి నుండి సినిమాలు రిలీజ్ అవ్వగా జనాలు మునుపటిలా థియేటర్స్ బారులు తీరి వచ్చేలా సినిమాలు రిలీజ్ కాలేదు, ఎట్టకేలకు “ది ఎయిట్ హండ్రడ్” సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర చైనాలో అల్టిమేట్ కలెక్షన్స్ ని సాధించి మొత్తం మీద ఇప్పటి వరకు 425K మిలియన్ డాలర్స్ అంటే ఇండియన్ కరెన్సీ లో 3100 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సాధించి వరల్డ్ లో 2020 ఇయర్ కి గాను హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా నిలిచింది. ఇదే సమయంలో…

ఇది వరకు ఇయర్ స్టార్టింగ్ లో హాలీవుడ్ మూవీ బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్ సినిమా సాధించిన 424K మిలియన్ డాలర్స్ ని బ్రేక్ చేసి నంబర్ 1 గా నిలవగా వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్ డైరెక్షన్ లో రీసెంట్ గా వరల్డ్ థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాక వచ్చిన టెనెట్ సినిమా మాత్రం అతి కష్టం మీద 240K మిలియన్ డాలర్స్ ని…

మాత్రమె అందుకుని ఫ్లాఫ్ దిశగా వెళుతుంది, ఇటు చైనా మాత్రం మళ్ళీ మునుపటిలా జనాలు బారులు తీరేలా సినిమాలు రిలీజ్ చేసుకుంటూ వరల్డ్ సినిమా ని ఈ ఏడాదికి నంబర్ 1 మూవీ కలెక్షన్స్ తో ఏలింది అని చెప్పొచ్చు. ఇక ఇండియా లో కరోనా ఏమాత్రం తగ్గక పోవడం తో థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అన్నది ఇంకా క్లారిటీ లేకుండా పోయింది.

Leave a Comment