న్యూస్ స్పెషల్

వరుణ్ డాక్టర్ రివ్యూ….కుమ్మింది సినిమా!!

కోలివుడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా ప్రజెంట్ విజయ్ తో బీస్ట్ సినిమా తీస్తున్న నెల్సన్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ డాక్టర్ తమిళ్ తో పాటు తెలుగు లో ఒకే రోజు రిలీజ్ ను సొంతం చేసుకుంది, హీరో అక్కడ మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరైనా తెలుగు లో పెద్దగా పాపులర్ కాదు కాబట్టి లిమిటెడ్ గానే రిలీజ్ అయిన ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంది ఎలా మెప్పించింది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ..

కథ పాయింట్ కి వస్తే మిలటరీ డాక్టర్ అయిన హీరో తను లవ్ చేసి హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ తో కొన్ని కారణాల వల్ల విదిపోతాడు, కానీ హీరోయిన్ చెల్లెలు కిడ్నాప్ అయ్యింది అని తెలుసుకుని హీరోయిన్ కి హీరోయిన్ ఫ్యామిలీకి హెల్ప్ చేయాలనీ డిసైడ్ అవుతాడు…

ఆ కిడ్నాప్ వెనుక ఒక పెద్ద రాకెట్ ఉంటుంది… మరి ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళని హీరో ఎలా పట్టుకున్నాడు అన్నది సినిమా కథ పాయింట్… చాలా చిన్న స్టొరీ పాయింట్ తో తెరకెక్కిన సినిమా స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో చాలా వరకు మెప్పించి అలరించింది అని చెప్పాలి.

హీరో శివ కార్తికేయన్ సటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా హీరోయిజం ఎలివేట్ సీన్స్ లో ఫైట్స్ లో దుమ్ము లేపాడు, ఇక హీరోయిన్ ప్రియాంక సాంగ్స్ వరకు మెరసినా పెద్దగా స్క్రీన్ స్పేస్ అయితే దక్కలేదు, విలన్ గా వినయ్ మరోసారి అదరగొట్టేశాడు. ఇక అందరికన్నా ఎక్కువ మార్కులు యోగిబాబు కామెడీకి దక్కుతాయి అని చెప్పాలి. మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు…

ఇక అనిరుద్ అందించిన సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అయ్యాయి. మామూలు సీన్స్ ని కూడా తన బ్యాగ్రౌండ్ తో ఎలివేట్ అయ్యేలా చేశాడు అనిరుద్, సినిమాటోగ్రఫీ అదిరిపోగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పించాయి. ఇక డైరెక్షన్స్ విషయానికి వస్తే నెల్సన్ చిన్న కథని స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసి మెప్పించాడు. డార్క్ కామెడీ గా తెరకెక్కిన డాక్టర్ సినిమా…

ఫస్టాఫ్ ఓ రేంజ్ లో ఎంటర్ టైన్ చేసి సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెంచుతుంది కానీ సెకెండ్ ఆఫ్ కొంచం స్లో అయినా ఓవరాల్ గా ఫస్టాఫ్ ఇచ్చిన కిక్ తో సినిమా మొత్తం బాగుంది అనిపించేలా ముగుస్తుంది. కథ బలంగా లేక పోవడంతో తర్వాత సీన్స్ ని చాలా వరకు ఊహించగలం, కానీ ఆ సీన్స్ ఆకట్టుకోవడంతో సినిమా మంచి నోట్ తో ముగుస్తుంది అని చెప్పాలి.

సినిమాలో యోగిబాబు కామెడీ, ఫస్టాఫ్ ఎంటర్ టైన్ మెంట్, అనిరుద్ మ్యూజిక్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ కాగా, థిన్ స్టొరీ లైన్, సెకెండ్ ఆఫ్ కొంచం సీరియస్ నోట్ తో ఉండటం, సెకెండ్ ఆఫ్ లో ఎమోషనల్ టచ్ అంతగా ఎఫెక్టివ్ గా లేకపోవడం లాంటివి చిన్న మైనస్ పాయింట్స్… అయినా కానీ ఎంటర్ టైనర్స్ ని ఇష్టపడేవాళ్ళు రెగ్యులర్ ఆడియన్స్ కి సినిమా కచ్చితంగా నచ్చుతుంది. ఫైనల్ గా సినిమా కి మా రేటింగ్ 3 స్టార్స్…

Leave a Comment