న్యూస్ బాక్స్ ఆఫీస్

వార్ కలెక్షన్స్: 210 కోట్ల టార్గెట్…6 రోజుల్లో వచ్చింది ఇది!!

బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ టైగర్ ష్రాఫ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వార్ బాక్స్ ఆఫీస్ దగ్గర అక్టోబర్ న సైరా నరసింహా రెడ్డి తో క్లాష్ లో కూడా రిలీజ్ అవ్వగా అల్టిమేట్ కలెక్షన్స్ తో ఆ సినిమా బాక్స్ ఆఫీస్ ను ఏలుతూ దూసుకు పోతుంది, సినిమా రిలీజ్ అయిన 6 రోజుల్లో ఇండియా లో ఏకంగా 187 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని రాబట్టి దుమ్ము దుమారం చేసింది.

సినిమా 6 వ రోజు సోమవారం అయినా ఇండియా లో 20 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ ని అందుకుని అల్టిమేట్ లెవల్ లో హోల్డ్ చేసింది. ఇక సినిమా టోటల్ గా హిందీ వర్షన్ 6 రోజులు పూర్తీ అయ్యే సరికి 180.3 కోట్ల నెట్ కలెక్షన్స్ ని ఇండియా లో అందుకుంది.

ఇక సినిమా తెలుగు లో 6 రోజులు పూర్తీ అయ్యే సరికి 2.7 కోట్ల దాకా షేర్ ని అందుకున్నట్లు సమాచారం. కాగా సినిమా ను ఇండియా లో టోటల్ గా 110 కోట్లకు అమ్మగా 210 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటికే 187 కోట్లు వెనక్కి తీసుకు వచ్చింది.

మిగిలిన రన్ లో మరో 23 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుంటే కంప్లీట్ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఈ రోజో లేక రేపో సినిమా ఆ మార్క్ ని అందుకోవడం ఖాయం. ఇక సినిమా తెలుగు లో 3.2 కోట్ల టార్గెట్ కి 2.7 కోట్లు వెనక్కి తేగా మరో 60 లక్షల షేర్ ని రాబట్టాల్సిన అవసరం నెలకొంది.

ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 6 రోజుల్లో 280 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని వసూల్ చేసినట్లు సమాచారం. వరల్డ్ వైడ్ గా అల్టిమేట్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న ఈ సినిమా లాంగ్ రన్ లో ఇండియా లో 300 కోట్ల రేంజ్ కి తక్కువ కాని నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!