Home న్యూస్ వాల్మీకి(గద్దలకొండ గణేష్) డే 2 కలెక్షన్స్…వరుణ్ తేజ్ ఊరమాస్!!

వాల్మీకి(గద్దలకొండ గణేష్) డే 2 కలెక్షన్స్…వరుణ్ తేజ్ ఊరమాస్!!

4
0

మాస్ మూవీస్ కి జనాల్లో ఉండే క్రేజ్ ఇదే… మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ వాల్మీకి (గద్దల కొండ గణేష్) బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ ని సాధించగా రెండో రోజు కూడా దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది, సినిమా మొదటి రోజు తో పోల్చితే రెండో రోజు డ్రాప్స్ 30% వరకు మాత్రమె ఉన్నాయి. ఇక మాస్ సెంటర్స్ లో అయితే డ్రాప్స్…

మరింత తక్కువగా ఉండటం తో రెండో రోజు కూడా వాల్మీకి (గద్దల కొండ గణేష్) హవా కొనసాగింది, కెరీర్ లో తొలిసారి చేసిన ఫుల్ లెంత్ మాస్ రోల్ తో వరుణ్ తేజ్ దుమ్ము లేపే రేంజ్ లో రెస్పాన్స్ ని సొంతం చేసుకోవడమే కాకుండా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రాంపేజ్ చూపుతున్నాడు.

సినిమా రెండో రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల తో పోల్చితే ఈవినింగ్ అండ్ నైట్ షోల కి మంచి గ్రోత్ ని సాధించింది, దాంతో రెండో రోజు ఇప్పుడు ఆన్ లైన్ టికెట్ సేల్స్ తో పాటు ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అంచనా వేస్తె అవలీలగా 3.5 కోట్ల మార్క్ ని అందుకోవడం…

ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఫైనల్ లెక్కలు అన్నీ అనుకూలిస్తే 3.8 కోట్ల వరకు కూడా లెక్క వెళ్ళే అవకాశం ఉందని చెబుతుండటం విశేషం, క్లాస్ సెంటర్స్ కి ధీటుగా మాస్ సెంటర్స్ కూడా జోరు చూపుతూ దూసుకు పోతుండటం విశేషం అని చెప్పాలి.

ఇక 2 వ రోజు వరల్డ్ వైడ్ షేర్ 4.2 కోట్ల వరకు ఉండే అవకాశం ఉండగా 2 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 11 కోట్ల లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆదివారం కూడా జోరు చూపితే బిజినెస్ లో సగానికి పైగా రికవరీ అవుతుంది. ఇక 2 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here