న్యూస్ బాక్స్ ఆఫీస్

వాల్మీకి కలెక్షన్స్: టార్గెట్ 25 కోట్లు…3 వారాల్లో వచ్చింది ఇది!!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ వాల్మీకి అలియాస్ గద్దల కొండ గణేష్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వారాలను పూర్తీ చేసుకుంది. కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం పది రోజులు జోరు చూపగా తర్వాత రిలీజ్ అయిన మమ్మోత్ సైరా దెబ్బ కి కొన్ని రోజులు తేరుకోలేదు, కానీ అప్పటికే మెజారిటీ కలెక్షన్స్ ని అందుకోవడం తో…

సినిమా మిగిలిన రన్ లో చాలా తక్కువ కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇక సినిమా మొత్తం మీద ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర 24.6 కోట్లకు పైగా షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకోగా అందులో రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా 21.38 కోట్ల షేర్ ని అందుకుంది.

ఒకసారి సినిమా 3 వారాల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 8.06Cr
?Ceeded: 3.51Cr
?UA: 2.61Cr
?East: 1.71Cr
?West: 1.42Cr
?Guntur: 1.82Cr
?Krishna: 1.42Cr
?Nellore: 83L
AP-TG Total:- 21.38Cr
Ka & ROI: 1.47Cr
OS: 1.80Cr
Total: 24.67Cr(38.63Cr Gross) ఇదీ సినిమా 3 వారాల కలెక్షన్స్.

ఇక సినిమా ను బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 24.25 కోట్ల రేంజ్ లో అమ్మగా మినిమం 25 కోట్ల రేంజ్ షేర్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా కంప్లీట్ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 30 లక్షలకు పైగా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి బిజినెస్ ని క్రాస్ చేసి…

అన్ని చోట్లా మైనస్ ప్రాఫిట్స్ ని సినిమా సొంతం చేసుకుంటుంది, ఫైనల్ రన్ పూర్తీ అయ్యే సరికి సినిమా కంప్లీట్ బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద సైరా తో పోటి వలన లాభాలు రాక పోయినా క్లీన్ హిట్ పరుగును ముగించ బోతుంది గద్దల కొండ గణేష్ సినిమా…

Leave a Comment