న్యూస్ స్పెషల్

వాళ్ళందరూ హ్యాండ్ ఇచ్చారు…ఇప్పుడు బిగ్గెస్ట్ అప్ డేట్ వచ్చేసింది!!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ఓ రేంజ్ లో జరిగేవి కానీ ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతుండటం తో అందరూ ఇళ్లకే పరిమితం అవ్వ గా ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీస్ గురించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఈ రోజు రావాల్సి ఉన్నప్పటి కీ ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు, అందరి కీ షాక్ ఇస్తూ ఆర్ ఆర్ ఆర్ యూనిట్ భారీ హ్యాండ్ ఇచ్చారు అని చెప్పాలి.

రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ ని లాక్ డౌన్ వలన అనుకున్న విధంగా తీర్చి దిద్దలేదని టీసర్ ని రిలీజ్ చేయలేదు, కనీసం పోస్టర్ ని అయినా రిలీజ్ చేస్తారు అనుకుంటే అది కూడా కుదరలేదని చెప్పేశారు. ఇదే సమయం లో…

త్రివిక్రమ్ ఎన్టీఆర్ ల కాంబో లో తెరకేక్కే అప్ కమింగ్ మూవీ పోస్టర్ కానీ టైటిల్ అనౌన్స్ మెంట్ కానీ ఉంటుంది అనుకుంటే అది కూడా సెట్ కాలేదు, ఇక తర్వాత అప్ డేట్స్ ఏమి ఉండవు అనుకుంటున్న టైం లో బిగ్గెస్ట్ అప్ డేట్ ని ఇచ్చేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్…

KGF తో ఇండియా వైడ్ గా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరిగా మారిన ప్రశాంత్ నీల్ అప్ కమింగ్ మూవీ ఎన్టీఆర్ తోనే అన్న విషయం అందరికీ ఇప్పటికే తెలిసినప్పటికీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ జరగలేదు, కానీ ఈ రోజు అఫీషియల్ గా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ బర్త్ డే కి విషెస్ చెబుతూ సినిమా గురించిన హింట్ కూడా ఇచ్చేశారు.

ఎన్టీఆర్ నిన్యూక్లియర్ ప్లాంట్ అంటూ, తన ఎనర్జీ ని మెచ్చుకుంటూ వేసిన బర్త్ డే ట్వీట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవ్వగా వీళ్ళ కాంబో లో సినిమా అఫీషియల్ గా సెట్ అవ్వడం తో మరింత జోరు మీడున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకి వెళుతుంది అన్నది ప్రస్తుతానికి అయితే సస్పెన్స్ అని చెప్పొచ్చు. బహుశా 2021 సెకెండ్ ఆఫ్ లో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పొచ్చు…

Leave a Comment