గాసిప్స్ న్యూస్

విజయ్ డైరెక్ట్ తెలుగు మూవీ….డైరెక్టర్….ప్రొడ్యూసర్ ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!!

కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ కెరీర్ లో ఎప్పటి నుండో టాలీవుడ్ మార్కెట్ పై దృష్టి పెట్టాడు కానీ సరైన సినిమాలు పడలేదు, అయినా కానీ ప్రయత్నాలు ఎప్పుడూ ఆపని విజయ్ తను చేసిన తమిళ్ మూవీస్ ని ఎప్పటికప్పుడు తెలుగు లో డబ్ చేస్తూనే వచ్చాడు. దాంతో ఒకే సారి కాకున్నా మెల్లి మెల్లిగా మార్కెట్ ని పెంచుకుంటూ పోయిన విజయ్ రీసెంట్ టైం లో తెలుగు లో…

సూపర్ మార్కెట్ ని సొంతం చేసుకున్నాడు. ఇలాంటి టైం లో మరో బిగ్ స్టెప్ వేయడానికి సిద్ధం అయ్యాడు విజయ్, ఈ స్టెప్ కనుక అనుకున్న విధంగా సెట్ అయితే విజయ్ తెలుగు మార్కెట్ డబుల్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఆ న్యూస్ ఏంటంటే విజయ్ త్వరలోనే…

తెలుగు లో డైరెక్ట్ మూవీ చేయబోతున్నాడు… డైరెక్ట్ అంటే తెలుగు ఒక్కటే కాదు, తమిళ్ అండ్ తెలుగు బైలింగువల్ గా ఒక మూవీ ని చేసే పనిలో ఉన్నాడని సమాచారం. ఆ మూవీ ఛాన్స్ ని సొంతం చేసుకుంది వంశీ పైడిపల్లి అని టాలీవుడ్ లో స్ట్రాంగ్ బజ్ ఇప్పుడు వినిపిస్తుంది…

ఇక ఈ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నారని సమాచారం, బైలింగువల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కనుక అంచనాలను తగ్గట్లు విజయ్ ప్రస్తుత రేంజ్ ని క్యారీ చేసే విధంగా సెట్ అయితే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉంటుంది. రీసెంట్ గా వచ్చిన మాస్టర్ మూవీ బాక్స్ అఫీస్ దగ్గర 50% ఆక్యుపెన్సీ తోనే…

అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక ఇప్పుడు విజయ్ కొత్త సినిమాను నెల్సన్ డైరెక్షన్ లో చేస్తుండగా ఆ సినిమా తర్వాత ఈ సినిమా ఉండే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు మరి.

Leave a Comment