గాసిప్స్ న్యూస్

విజయ్ దేవరకొండతో గొడవ పై ఎట్టకేలకు స్పందించిన విశ్వక్ సేన్…ఏమన్నాడంటే!!

టాలీవుడ్ యంగ్ హీరోల్లో యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి మూవీస్ తో సెన్సేషనల్ క్రేజ్ ను సొంతం చేసుకోగా, తర్వాత వచ్చిన హీరోల్లో ఓన్ ఇడెంటిటీని తనదైన స్టైల్ లో సొంతం చేసుకున్న మరో హీరో విశ్వక్ సేన్… ఫలక్నుమా దాస్, హిట్ ది ఫస్ట్ కేస్ మూవీస్ తో విశ్వక్ సేన్ కి కూడా…

మంచి మార్కెట్ ఏర్పడింది. ఫలక్నుమా దాస్ టైం లో స్టేజ్ మీద విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ అప్పట్లో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఒకడ్ని లేపినం.. మళ్లీ ఈన్నెక్కడ లేపాల్రా నాయనా అనుకుంటున్నారేమో.. నన్నెవడూ లేపాల్సిన అవసరం లేదు.. నన్ను నేనే లేపుకుంటానంటూ…

విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ విజయ్ దేవరకొండ ని ఉద్దేశించి అన్నాడు అంటూ చర్చలు పీక్స్ లో జరిగాయి, ఈ మ్యాటర్ పై విజయ్ దేవరకొండ ఎప్పుడూ స్పందించలేదు కానీ విశ్వక్ సేన్ ఎట్టకేలకు రీసెంట్ గా ఒక వెబ్ ఇంటర్వ్యూ లో భాగంగా స్పందించి ఈ విషయం పై ఒక క్లారిటీ ఇచ్చారు.

అలా అన‌డానికి ఒక కార‌ణం ఉందని, నన్ను ఉద్దేశ్యించి ఒక నిర్మాత వీడిని తొక్కేయండ్రా అని అన్నాడు. అది మ‌న‌సులో పెట్టుకొని స్టేజ్‌ పై కంగారులో అలా మాట్లాడాను. విజ‌య్‌కు నాకు స్నేహం కాని శతృత్వం కాని లేవు. నన్ను ఎవ‌రు లేపాల్సిన ప‌ని లేదు. ఎవరూ అవకాశాలు ఇవ్వకపోయినా కూడా తానే డైరెక్షన్ చేసుకుంటానని చెప్పుకొచ్చారు విశ్వ‌క్ సేన్.

దాంతో ఆ మాటలు విజయ్ దేవరకొండ ని ఉద్దేశ్యించి కాదని ఓ నిర్మాత తనపై చేసిన కామెంట్స్ కి కౌంటర్ అని, కానీ అది జనాల్లో వేరేవిధంగా వెళ్ళింది అంటూ చెప్పుకొచ్చాడు విశ్వక్ సేన్… కానీ అందులో కూడా విజయ్ పేరు ఎత్తకున్నా ఆ టైం కి విజయ్ నే ఇన్ డైరెక్ట్ గా సింక్ చేయడం వలన అప్పటి నుండి ఇద్దరు హీరోలకు పడదని వార్తలు వచ్చాయి.

Leave a Comment