న్యూస్

విజయ్ దేవరకొండ క్రేజ్ పవర్…డిసాస్టర్ మూవీ కి 250….ఇదీ రచ్చంటే!!

యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూ పోతుంది, ఇంస్టగ్రామ్ లో హైయెస్ట్ ఫాలోవుడ్ సౌత్ హీరోగా రికార్డ్ కొట్టిన విజయ్ దేవరకొండ అనతికాలంలోనే నేషనల్ వైడ్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. కెరీర్ లో పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీ వాలా లాంటి హిట్స్ ఉన్నప్పటికీ రీసెంట్ టైం లో బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన హిట్ దక్కలేదు విజయ్ దేవరకొండ కి…

అయినా కానీ క్రేజ్ పరంగా యంగ్ హీరోల్లో సాలిడ్ క్రేజ్ తో దూసుకు పోతున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు లైగర్ సినిమా తో ఆల్ ఇండియా లెవల్ లో రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా విజయ్ దేవరకొండ కి నార్త్ లో క్రేజ్ ఓ రేంజ్ లో ఉందని…

విజయ్ దేవరకొండ హిందీ డబ్బింగ్ మూవీస్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ నిజం చేస్తున్నాడు. ఇక్కడ బిగ్ డిసాస్టర్ గా నిలిచిన డియర్ కామ్రేడ్ సినిమా బాలీవుడ్ లో డబ్ అవ్వగా అక్కడ అల్టిమేట్ వ్యూస్ రికార్డ్ తో దూసుకు పోతూ రచ్చ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పొచ్చు.

ఈ సినిమా అక్కడ రీసెంట్ గా 250 మిలియన్ వ్యూస్ మార్క్ ని కంప్లీట్ చేసుకుని బాక్స్ ఆఫీస్ డిసాస్టర్ మూవీస్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. వ్యూస్ ఒక్కటే కాదు లైక్స్ పరంగా కూడా సత్తా చాటుకున్న ఈ సినిమా 2.98 మిలియన్ లైక్స్ మార్క్ ని పూర్తీ చేసుకుని…

3 మిలియన్ లైక్స్ మార్క్ ని అందుకోబోతుంది. తెలుగు లో బాక్స్ ఆఫీస్ ఫేల్యూర్ గా నిలిచినప్పటికీ కూడా సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ అల్టిమేట్ హిట్ గా నిలిచి రచ్చ చేసి ఇప్పుడు విజయ్ దేవరకొండ లైగర్ పై అంచనాలు పెంచింది. మరి ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రచ్చ చేస్తుందో అనేది ఆసక్తిగా మారిందని చెప్పాలి.

Leave a Comment