గాసిప్స్ న్యూస్

విజయ్ బీస్ట్ కి తెలుగు లో సెన్సేషనల్ బిజినెస్ ఆఫర్…వరుస హిట్స్ జోరు ఇది!

కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా ఇప్పుడు సాలిడ్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్న హీరో ఇలయ దళపతి విజయ్…. బాక్ టు బాక్ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ లను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న విజయ్ ప్రసుతం కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్నాడని చెప్పాలి. విజయ్ రీసెంట్ మూవీస్ టాక్ ఎలా ఉన్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ లు గా నిలుస్తున్నాయి.

ఈ ఇయర్ ఫస్ట్ వేవ్ తర్వాత ఆడియన్స్ ముందుకు మాస్టర్ సినిమా తో వచ్చినా 50% ఆక్యుపెన్సీ తో ఆ సినిమా రచ్చ రచ్చ చేసింది. తెలుగు లో కూడా ఈ ఏడాది డబ్ మూవీస్ పరంగా క్లీన్ హిట్ గా నిలిచిన ఒకే ఒక సినిమాగా నిలిచింది మాస్టర్ మూవీ.

అలాంటి హిట్ మూవీ తర్వాత విజయ్ చేస్తున్న కొత్త సినిమా బీస్ట్… నెల్సన్ అనే డైరెక్టర్ తో కలిసి చేస్తున్న ఈ సినిమా పోస్టర్స్ తోనే మంచి హైప్ ను సొంతం చేసుకుంది. వచ్చే సంక్రాంతికి రిలీజ్ అంటున్నారు కానీ ఇంకా ఏమి కన్ఫాం కాలేదు. కానీ సినిమా పై….

క్రేజ్ సాలిడ్ గా ఉన్న నేపధ్యంలో తెలుగు లో నుండి సినిమా బిజినెస్ ఆఫర్స్ సాలిడ్ గా వస్తున్నాయని తెలుస్తుంది. మాస్టర్ మూవీ కి 8 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరగగా ఈ సినిమా ఏకంగా 10 కోట్ల ఓవరాల్ రేటు ఇవ్వడానికి ఇక్కడ బయ్యర్స్ సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. తెలుగు లో విజయ్ సినిమా కి ఇది ఆల్ టైం హైయెస్ట్ బిజినెస్ ఆఫర్ గా చెప్పుకోవాలి.

కానీ సినిమా రిలీజ్ డేట్ ని ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి అనౌన్స్ చేసిన తర్వాత బిజినెస్ ను మొదలు పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారట. ఒకవేళ సంక్రాంతికే కన్ఫాం అయితే తెలుగు లో పోటి తీవ్రంగా ఉంది కాబట్టి సంక్రాంతికి రిలీజ్ చేస్తారో లేదో చూడాలి. అలాగే అప్పుడు ఈ బిజినెస్ కూడా ఇలానే ఉంటుందా తగ్గుతుందా అనేది ఆసక్తికరం అని చెప్పాలి.

Leave a Comment