న్యూస్ స్పెషల్

విజయ్ “విజిల్” TRP రేటింగ్…సాలిడ్ గా కుమ్మింది!!

కోలీవుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ బిగిల్ తెలుగు లో విజిల్ పేరు తో డబ్ అయ్యి రిలీజ్ అయిన విషయం తెలిసిందే, తెలుగు లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా కూడా భారీ వసూళ్ళ తో కుమ్మేసింది, తమిళ్ కలెక్షన్స్ క్లారిటీ ఉండవు కానీ ట్రేడ్ లెక్కల్లో సినిమా 290 కోట్లకు పైగా గ్రాస్ ని వసూల్ చేసింది.

షేర్ 150 కోట్లకు పైగానే వచ్చినట్లు అంచనా… ఇక తెలుగు లో సినిమా 11.57 కోట్ల షేర్ ని అందుకుని విజయ్ కెరీర్ లో తెలుగు లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. ఇక సినిమా రీసెంట్ గా తెలుగు లో టెలికాస్ట్ అయింది.

కాగా సినిమా కి ఇక్కడ టెలికాస్ట్ అయిన టైం లో సాలిడ్ TRP రేటింగ్ దక్కింది, తెలుగు లో విజయ్ కెరీర్ లో హైయెస్ట్ TRP రేటింగ్ ని సొంతం చేసుకున్న సినిమా గా సంచలనం సృష్టించింది ఈ సినిమా. కాగా సినిమా కి మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు మొత్తం మీద 6.86 TRP రేటింగ్ దక్కిందని సమాచారం.

ఇక్కడ ఇది వరకు విజయ్ నటించిన మూవీస్ లో సర్కార్ కి 5.9 TRP రేటింగ్, పోలిసోడు సినిమా కి 5.72 TRP రేటింగ్, అదిరింది సినిమా కి 5.41 TRP రేటింగ్ దక్కాయు. ఆ సినిమాలతో పోల్చితే ఇప్పుడు విజిల్ కి భారీ లెవల్ లో TRP రేటింగ్ పెరిగిందని చెప్పొచ్చు. తెలుగు లో విజయ్ కి మార్కెట్ బాగానే పెరిగిందని చెప్పాలి.

ఇక ఇప్పుడు కార్తీ కి ఖైదీ తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన లోకేష్ తో విజయ్ మాస్టర్ అనే సరికొత్త సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సమ్మర్ కానుకగా రిలీజ్ కాబోతుంది, తెలుగు లో కూడా సినిమా ను డబ్ చేసి భారీ ఎత్తున రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా విజయ్ మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంది.

Leave a Comment