న్యూస్ స్పెషల్

విజయ్ 19-మహేష్ 14…సౌత్ టాప్ 2 వీళ్ళే!

సోషల్ మీడియా లో హీరోల సినిమాల అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు, హీరో అఫీషియల్ హ్యాండిల్ నుండి ఏదైనా అప్ డేట్ వస్తే చాలు ఇక ఫ్యాన్స్ ఆ ట్వీట్ ని లైక్ చేసి రీట్వీట్ చేయడం అన్నది కామన్, ఇలా ట్విట్టర్ లో ఎక్కువగా యాక్టివ్ గా ఉన్న హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందు నిలుస్తాడు, ఎక్కువగా యాక్టివ్ గా ఉండటమే కాదు…

సౌత్ లోనే ట్విట్టర్ లో హైయెస్ట్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న హీరోగా ముందు నిలిచే మహేష్ తనకి నచ్చిన ప్రతీ విషయాన్ని సోషల్ మీడియా లో ఫ్యాన్స్ తో పంచుకోవడంలో ముందు నిలుస్తాడు, ఇక మరో పక్క తమిళ్ లో బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్స్ లో…

ముందు నిలిచే హీరో ఇలయ దళపతి విజయ్ అని చెప్పాలి, అఫీషియల్ గా ట్విట్టర్ అకౌంట్ లేకున్నా తన ఆఫీస్ అకౌంట్ నే మెయిన్ టైన్ చేస్తూ ఉండగా ఫాలోవర్స్ తక్కువగా ఉన్నా కానీ విజయ్ హ్యాండిల్ నుండి పోస్ట్ పడితే చాలు అది రికార్డు లెవల్ లో లైక్స్ అండ్ రీట్వీట్స్ ని సొంతం చేసుకుంటుంది.

అందుకే విజయ్ హ్యాండిల్ నుండి వచ్చిన ట్వీట్స్ లో మొత్తం మీద 19 సార్లు 1 లక్ష లైక్స్ ని అందుకున్న ట్వీట్స్ తో సౌత్ లోనే హైయెస్ట్ లైకుడ్ ట్వీట్స్ తో అల్టిమేట్ రికార్డ్ ను సొంతం చేసుకోగా టాలీవుడ్ లో ఈ ఏడాదే మొదలైన ఈ ట్రెండ్ ని మహేష్ ఫ్యాన్స్ మరో లెవల్ కి చేర్చుతూ…

మహేష్ ఖాతాలో 14 సార్లు 1 లక్ష లైక్స్ ని చేర్చి సౌత్ లో 2 వ హైయెస్ట్ 1 లక్ష లైక్స్ ని సొంతం చేసుకున్న స్టార్ గా నిలిపారు. మహేష్ ఈ మధ్య ఎక్కువగా యాక్టివ్ గా ఉంటున్న నేపద్యంలో త్వరలో విజయ్ రికార్డ్ బ్రేక్ అయ్యే అవకాశం కూడా ఉన్నప్పటికీ.. విజయ్ ఖాతాలో 2 లక్షల లైక్స్ అలాగే 3 లక్షల లైక్స్ ట్వీట్స్ కూడా ఉన్నాయి, ఇవి బ్రేక్ అవ్వడం ప్రస్తుతానికి అసాధ్యంగా ఉందని చెప్పాలి.

Leave a Comment