న్యూస్ బాక్స్ ఆఫీస్

విజయ రాఘవన్ తమిళ్-తెలుగు 1st డే కలెక్షన్స్…అక్కడ No 1 ప్లేస్!!

బిచ్చగాడు సినిమాతో సంచలనం సృష్టించిన విజయ్ ఆంథోని నటించిన లేటెస్ట్ మూవీ విజయ రాఘవన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా ఒకే టైం లో రిలీజ్ ను సొంతం చేసుకుంది, సినిమా కి ఆడియన్స్ నుండి యావరేజ్ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందని చెప్పొచ్చు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అటు తమిళ్ లో ఇటు తెలుగు లో భారీగానే రిలీజ్ ను సొంతం చేసుకుంది…

ఇండియా లో ఈ సినిమా మొదటి రోజు ఆల్ మోస్ట్ 810 స్క్రీన్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకుందట, ఇది విజయ్ అంథోని కెరీర్ లోనే హైయెస్ట్ కౌంట్ అని చెబుతూ ఉండగా సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 16 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది…

అందులో కొన్ని చోట్ల డెఫిసిట్ లు అండ్ నెగటివ్ షేర్స్ కూడా ఉన్నాయి… టోటల్ గ్రాస్ 28 లక్షల రేంజ్ లో ఉంటుంది.. ఇక్కడ సినిమా నిరాశ పరిచే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న తమిళనాడు లో మాత్రం సెకెండ్ వేవ్ తర్వాత హైయెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకుంది.

అక్కడ ఈ సినిమా తో పోల్చితే పెద్ద సినిమాలు అయిన విజయ్ సేతుపతి లాభం, తలైవి లాంటి సినిమాలు ఫస్ట్ డే 1 కోటి రేంజ్ లోపే గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఈ సినిమా మాత్రం మాస్ సెంటర్స్ లో కుమ్మేస్తూ 1.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని మొదటి రోజు అక్కడ సొంతం చేసుకుందట. దాంతో అక్కడ ఇప్పుడు నంబర్ 1 గా నిలిచింది ఈ సినిమా…

టోటల్ ఇండియా లో ఇప్పుడు మొదటి రోజు కి గాను 1.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని ఈ సినిమా సొంతం చేసుకుందని సమాచారం. బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవ్వాలి అంటే రానున్న రోజుల్లో ఇదే రేంజ్ లో జోరు ని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం మీద ఇక వీకెండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లెక్క ఏ విధంగా ఉంటుందో చూడాలి.

Leave a Comment