న్యూస్ రివ్యూ

విజయ రాఘవన్ రివ్యూ…హిట్టా-ఫట్టా!

బిచ్చగాడు తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ను అందుకున్న్ విజయ్ ఆంథోని అప్పటి నుండి చేసిన ప్రతీ సినిమాను తెలుగు లో కూడా క్రమం తప్పకుండా రిలీజ్ చేస్తూ ఉండగా మధ్యలో ఒక కిల్లర్ అనే మూవీ తప్పితే మిగిలిన సినిమాలు ఏవి కూడా తెలుగు లో వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఆడియన్స్ ముందుకు విజయ రాఘవన్ సినిమా తో వచ్చిన విజయ్ ఆంథోని ఎంతవరకు అంచనాలాను అందుకున్నాడో తెలుసుకుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ కి వస్తే…తన తల్లి కోరిక మేర ఐఏఎస్ అవ్వాలి అనుకునే హీరో హైదరాబాదులో ఒక కాలనీలో చదువుకుంటూ అక్కడ పిల్లలకు ట్యూషన్ చెబుతూ ఉంటాడు… కానీ అనుకోకుండా అక్కడ లోకల్ గ్యాంగ్ తో గొడవ పడటం తో…ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళకుండా చేస్తారు ఆ గ్యాంగ్ వాళ్ళు…

తర్వాత ఏం జరిగింది… హీరో ఏం చేశాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… కథ పాయింట్ ఓవరాల్ గా చూసుకుంటే పర్వాలేదు అనిపించే విధంగా ఉన్న కథనం చాలా స్లో నరేషన్ తో కూడుకుని ఉండి లెంత్ పెంచడమే కాదు బోర్ కొట్టేలా చేస్తుంది… విజయ్ ఆంథోని తన రోల్ వరకు ఫుల్ న్యాయం చేయగా సెంటిమెంట్ సీన్స్ లో బాగా నటించాడు…

హీరోయిన్ ఓకే అనిపించగా మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు అనిపించారు. సంగీతం యావరేజ్ గా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది, ఎడిటింగ్ వీక్ గా ఉంది… డైరెక్షన్ విషయానికి వస్తే కథ పాయింట్ మంచిదే అయినా స్లో నరేషన్ ప్రిడిక్ట్ చేసే కథ వలన సినిమా ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని అనిపించడం ఖాయం.. కొన్ని సీన్స్ ఇంప్రెస్ చేసినా కానీ ఓవరాల్ గా సినిమా మాత్రం….

ఏమాత్రం ఇంప్రెస్ చేయలేక పోయింది… లెంత్ తగ్గించి ఉన్నా కొంచం బెటర్ అయ్యేదేమో కానీ లెంత్ కూడా ఎక్కువే అవ్వడం తో సెకెండ్ ఆఫ్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఎదురు చూడటం ఖాయం.. ఓవరాల్ గా ఇక ఏ ఆప్షన్ లేదు అనుకుంటే ఈ సినిమా కి వెళ్ళొచ్చు… సినిమా కి మొత్తం మీద మేం ఇస్తున్న రేటింగ్ 2.25 స్టార్స్….

Leave a Comment