న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

వినయ విదేయ రామ తమిళ్ TRP రేటింగ్…షాకింగ్ అసలు!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రీసెంట్ మూవీ వినయ విదేయ రామ ఈ ఇయర్ సంక్రాంతి కి రిలీజ్ అయ్యి అంచనాలను అందుకోలేక పోయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ టాక్ తో హైయెస్ట్ షేర్ వసూల్ చేసిన టాలీవుడ్ సినిమాలలో ఒకటిగా చేరి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా సినిమా తమిళ్ లో కూడా డబ్ అవ్వగా అక్కడ కూడా అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేక పోయింది.

కాగా రీసెంట్ గా సినిమా ను తమిళ్ లో విజయ్ టీవీ లో టెలికాస్ట్ చేశారు. సినిమాను వారు సుమారు 1.1 కోట్ల రేటు ఇచ్చి కొన్నట్లు సమాచారం. కాగా మొదటి సారి టెలికాస్ట్ అయిన సమయం లో సినిమా కి అక్కడ మొత్తం మీద 2.6 TRP రేటింగ్ దక్కిందట.

ఇది తెలుగు డబ్ మూవీస్ లో అక్కడ వన్ ఆఫ్ ది టాప్ TRP రేటింగ్ లలో ఒకటిగా చెప్పుకుంటున్నారు. అక్కడ మహేష్ 1 నేనొక్కడినే 13 కి పైగా TRP రేటింగ్ తో టాప్ లో ఉండగా మిగిలిన తెలుగు డబ్ మూవీస్ లో కొన్ని మాత్రమె అక్కడ పర్వాలేదు అనిపించే TRP రేటింగ్ లను సొంతం చేసుకున్నాయి.

ఇప్పుడు వాటిలో ఒకటిగా వినయ విదేయ రామ సినిమా TRP రేటింగ్ నిలిచింది. ఈ సినిమా తెలుగు లో ఇంకా టెలివిజన్ లో టెలికాస్ట్ అవ్వలేదు కానీ ముందే తమిళ్ లో టెలికాస్ట్ అవ్వడం విశేషం అనే చెప్పాలి. ఇక ఈ సినిమా ను కొన్న విజయ్ టీవీ వారికి మాత్రం…

మొదటి టెలికాస్ట్ లోనే మంచి లాభాలు దక్కినట్లు సమాచారం, అది ఒకింత ఆశ్యర్యం కలిగించే విషయం అనే చెప్పాలి. ఇక రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ ఎన్టీఆర్ తో కలిసి చేస్తున్న RRR వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!