న్యూస్ స్పెషల్

వినయ విదేయ రామ Vs సరైనోడు…ఈ 2 సినిమాల TRP…లాంగ్ రన్ కా బాప్స్!!

వినయ విదేయ రామ Vs సరైనోడు… బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన ఈ రెండు సినిమాల్లో సరైనోడు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది, ఇక వినయ విదేయ రామ సినిమా మాత్రం అంచనాలను అందుకోలేక అట్టర్ ఫ్లాఫ్ అయింది, కానీ ఈ రెండు సినిమాలకు కూడా టెలివిజన్ లో మాత్రం అద్బుతమైన TRP రేటింగ్ టెలికాస్ట్ అయిన ప్రతీ సారి దక్కడం మాత్రం మాములు విషయం కాదు.

ముఖ్యంగా సరైనోడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఎలా సంచలన కలెక్షన్స్ ని అందుకుందో బుల్లి తెరపై కూడా టెలికాస్ట్ అయిన ప్రతీ సారి అల్టిమేట్ TRP రేటింగ్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది.

రీసెంట్ టైం లో ఈ సినిమా సాధించిన TRP రేటింగ్ ని గమనిస్తే, 7.64, 7.94, 5.64, 6.9, ఇలా రీసెంట్ టైం లో టెలికాస్ట్ అయిన ప్రతీ సారి సెన్సేషనల్ TRP రేటింగ్ ని అందుకుంది, ఆల్ రెడీ సినిమా టెలివిజన్ లో పదుల సంఖ్య లో టెలికాస్ట్ అయినా లాంగ్ రన్ లో అల్టిమేట్ హోల్డ్ ని సొంతం చేసుకుంది.

ఇక వినయ విదేయ రామ సినిమా ది సేపెరేట్ స్టొరీ, వెండి తెరపై డిసాస్టర్ అయినా కానీ బుల్లితెర పై మాత్రం మొదటి సారి నిరాశ పరిచినా లాంగ్ రన్ లో మాత్రం 7 సార్లు టెలికాస్ట్ అవ్వగా అన్ని సార్లు కూడా మంచి రేటింగ్స్ ని సొంతం చేసుకుని ఈ సినిమా అందరికీ భారీ షాక్ నే ఇచ్చింది.

1st time – 7.9 TRP
2nd time – 8.2 TRP
3rd time – 8.16TRP
4th time – 7.2 TRP
5th time – 8.18 TRP
6th time – 5.19 TRP
7th time – 6.35 TRP
ఇలా టెలికాస్ట్ అయిన ప్రతీ సారి కూడా సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఈ సినిమా. మొత్తం మీద ఈ మధ్య కాలం లో ఈ రెండు సినిమాలు టెలివిజన్ లో దుమ్ము లేపగా, మహేష్ బాబు మహర్షి కూడా లాంగ్ రన్ లో టెలివిజన్ లో దుమ్ము లేపుతున్న మరో సినిమా గా నిలిచింది.

Leave a Comment