న్యూస్

విశాల్ ఆర్య ఎనిమీ టీసర్ రివ్యూ….మాస్ కుమ్ముడు ఇది!

యాక్షన్ హీరో విశాల్ ఆర్య తో కలిసి ఇది వరకు వాడు వీడు అనే సినిమాను బాలా డైరెక్షన్ లో చేయగా ఆ సినిమా ఆడియన్స్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. కంప్లీట్ తమిళ్ ఫేవర్ ఉన్నప్పటికీ తెలుగు లో కూడా ఈ సినిమా కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో చాలా కాలానికి మరో సినిమా వస్తుంది, ఆ సినిమానే ఎనిమీ….

రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని తర్వాత టీసర్ ను కూడా రిలీజ్ చేయగా తెలుగు లో కూడా రిలీజ్ అయిన ఈ టీసర్ ఓ రేంజ్ లో మెప్పించింది అని చెప్పాలి. టీసర్ మొత్తం మీద కేవలం ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ ఒక్క చోటే పెట్టగా ప్రపంచంలోనే….

ప్రమాద కరమైన శత్రువు ఎవరో తెలుసా…. నీ గురించి అంతా తెలిసిన నీ స్నేహితుడే అంటూ చెప్పిన డైలాగ్ తో విశాల్ ఆర్య లు ముందు స్నేహితులు అని, తర్వాత శత్రువులుగా మారతారని కన్ఫాం చేశారు. విశాల్ పోలిస్ రోల్ లో నటిస్తున్నట్లు టీసర్ లో కన్ఫాం అవ్వగా….

ఆర్య జైలు డ్రెస్ తో కనిపించాడు… సినిమా క్వాలిటీ అదిరి పోయిందని టీసర్ లో ఉన్న గ్రాండియర్ ని చూస్తె అర్ధం అవుతుంది, ఇక యాక్షన్ సెన్స్ లో ఇద్దరూ అదరగొట్టగా విశాల్ మరింతగా రెచ్చిపోయాడు. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ టీసర్ కి మెయిన్ హైలెట్ అయింది. ప్రతీ సీన్ ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేసింది బ్యాగ్రౌండ్ స్కోర్…

మొత్తం మీద టీసర్ సినిమా పై ఉన్న… అంచనాలను అమాంతం పెంచేసింది అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుంది అంటున్న ఈ సినిమా తమిళ్ మరియు తెలుగు లో ఒకే టైం లో రిలీజ్ కానుంది. టీసర్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఈ సారి విశాల్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందనిపిస్తుంది…

Leave a Comment