గాసిప్స్ న్యూస్

విశాల్ సినిమా ఆపండి…8 కోట్లు కట్టాలి…కోర్టులో కేసు వేసిన ప్రొడ్యూసర్

తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి బిజినెస్ మార్కెట్ ఉన్న హీరోల్లో విశాల్ కూడా ఒకరు. కెరీర్ లో హిట్స్ అండ్ ఫ్లాఫ్స్ కామన్ కానీ స్టడీ మార్కెట్ ని రెండు చోట్లా మెయిన్ టైన్ చేస్తున్న విశాల్ రీసెంట్ టైం లో వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నాడు… డిటెక్టివ్, అభిమన్యుడు మరియు పందెం కోడి 2 సినిమాలతో మంచి కంబ్యాక్ ఇచ్చి హిట్స్ కొట్టిన విశాల్ తర్వాత అయోగ్య మరియు…

యాక్షన్ సినిమాలతో వరుస ఫ్లాఫ్స్ ని సొంతం చేసుకున్నాడు.. ముఖ్యంగా యాక్షన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 45 కోట్ల రేంజ్ బడ్జెట్ తో భారీగా రూపొందగా కలెక్షన్స్ అట్టర్ ఫ్లాఫ్ రేంజ్ లో వచ్చి భారీ నష్టాలను మిగిలించగా ఈ సినిమా తర్వాత విశాల్ చేసిన కొత్త సినిమా…

చక్ర ఇప్పుడు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి సిద్దం అవుతుండగా ఈ సినిమా పై ఇప్పుడు కోర్టు లో కేసు వేశారు యాక్షన్ సినిమా నిర్మాతలు ట్రైడెంట్ ఆర్ట్స్ వాళ్ళు. విశాల్ తో యాక్షన్ సినిమా వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని… కానీ ఇప్పుడు విశాల్ కొత్త సినిమాతో…

మంచి బిజినెస్ లు చేసుకుంటున్నాడని, తమకి వచ్చిన నష్టానికి నష్టపరిహారం కింద 8 కోట్లు చెల్లించాలని, అలా చెల్లిస్తేనే ఈ సినిమా రిలీజ్ కి మేం ఒప్పుకుంటామని అప్పటి వరకు సినిమా రిలీజ్ ని ఆపి తీరాలని కండీషన్ పెట్టారు. దాంతో కోలివుడ్ లో మొత్తం ఈ సినిమా గురించే ఇప్పుడు అందరూ మాట్లాడు కుంటున్నారు. ఇంత జరిగినా ఇప్పటి వరకు…

విశాల్ చక్ర టీం నుండి ఎలాంటి అనౌన్స్ మెంట్ లేదు… ఇక చక్ర సినిమా కోసం రెండు యాప్స్ పోటి పడగా ఆల్ మోస్ట్ రేటు ఫైనల్ స్టేజ్ లో ఉందని తెలుస్తుంది. ఆ రేటు కూడా సినిమా బడ్జెట్ కన్నా తక్కువే ఆఫర్ చేస్తుండటం తో ఇప్పుడు ఈ అడ్డంకి రావడం మరింత షాక్ గా మారిందని చెప్పాలి..

Leave a Comment