గాసిప్స్ న్యూస్

విశ్వక్ సేన్ చేయాల్సిన హిట్ సీక్వెల్ ఇప్పుడు ఈ క్రేజీ హీరో చేతిలో?

నాచురల్ స్టార్ నాని నిర్మాణంలో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన హిట్ ది ఫస్ట్ కేస్ సినిమా ఈ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిబ్రవరి నెలలో అప్పటికే బాక్స్ ఆఫీస్ ను ఏలుతున్న సంక్రాంతి సినిమాలు మరియు భీష్మ సినిమాల పోటి లో కూడా నిలిచి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ ను సొంతం చేసుకుని సత్తా చాటుకుంది, ఆ సినిమా సాధించిన విజయం తర్వాత వెంటనే ఆ సినిమాకి…

సీక్వెల్ ని త్వరలో మొదలు పెడతాం అని కన్ఫాం చేశాడు నాని, ఇక హీరోగా మరోసారి విశ్వక్ సేన్ ఉండటం కూడా ఖాయం అని అంతా భావించారు, ఇక కరోనా మొదలు అవ్వడం తో ఈ ప్రాజెక్ట్ మొదలు కాలేకపోగా అలాగే పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ సినిమా…

ఎట్టకేలకు త్వరలో తిరిగి మొదలు కాబోతుండగా ఇప్పుడు సినిమా గురించిన ఒక న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది, ఆ న్యూస్ ప్రకారం అప్ కమింగ్ మూవీస్ కమిట్ మెంట్స్ వలన విశ్వక్ సేన్ ఈ సీక్వెల్ నుండి తప్పుకున్నాడని ఇప్పుడు విశ్వక్ సేన్ ప్లేస్ లో…

రీసెంట్ టైం కి ఎక్స్ పెరిమెంటల్ మూవీస్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ హిట్స్ ని సొంతం చేసుకున్న అడవి శేష్ ఇప్పుడు సీక్వెల్ లో నటించ బోతున్నాడు అన్నది లేటెస్ట్ టాలీవుడ్ టాక్. క్షణం, అమీతుమీ, గూడచారి, ఎవరు లాంటి బాక్ టు బాక్ హిట్స్ తో దూసుకు పోతున్న అడవి శేష్ ఇప్పుడు మహేష్ బాబు నిర్మాణంలో…

మేజర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే, ఆల్ మోస్ట్ పూర్తీ కావొస్తున్న ఈ సినిమా తర్వాత అడవి శేష్ చేయబోయే సినిమా ఇదే అవుతుంది అన్న టాక్ ఎక్కువగా వినిపిస్తుంది ఇప్పుడు, ఈ సినిమాతో పాటు గూడచారి 2 కూడా లైనప్ లో పెట్టుకున్న అడవి శేష్ అవి కూడా సక్సెస్ అయితే తన లెవల్ ని మరింత పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Leave a Comment