న్యూస్ స్పెషల్

వీర రాఘవుడి దెబ్బ….530K తో టాప్ 2!!

సరిగ్గా ఏడాది క్రితం టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ అరవింద సమేత వీర రాఘవ రిలీజ్ అయ్యింది, అప్పటి నుండి ఎన్టీఆర్ ఫుల్ బిజీ గా RRR పనులలోనే ఉండగా అభిమానులు ఎన్టీఆర్ కొత్త సినిమాల అప్ డేట్స్ లేక పాత సినిమాల యానివర్సరీ ట్రెండ్ ను అప్పుడప్పుడు వీలు కుదుర్చుకుని సోషల్ మీడియా లో చేస్తున్నారు.

ఇక అరవింద సమేత వచ్చి ఏడాది పూర్తీ అయిన సందర్భంగా సోషల్ మీడియా లో ట్రెండ్ చేయడం మొదలు పెట్టారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. కాగా 24 గంటల్లో ఓవరాల్ గా హాల్ఫ్ మిలియన్ మార్క్ ని క్రాస్ చేసి సంచలనం సృష్టించగా ఫైనల్ కౌంట్ 24 గంటలకు గాను…

5 లక్షల 30 వేల ట్వీట్స్ దగ్గర కి వచ్చి ఆగింది. ఇది రీసెంట్ టైం లో ఆల్ టైం సెకెండ్ బిగ్గెస్ట్ యానివర్సరీ ట్రెండ్ గా చెప్పుకోవచ్చు. రీసెంట్ గా మహేష్ ఫ్యాన్స్ దూకుడు రిలీజ్ అయ్యి 8 ఏళ్ళు పూర్తీ అయిన సందర్భంగా సోషల్ మీడియా లో 6 లక్షల 76 వేల కి పైగా ట్వీట్స్ పోల్ చేసి టాప్ ప్లేస్ లో ఉన్నారు.

ఇక ఇప్పటి వరకు జరిగిన యానివర్సరీ ట్రెండ్ లో ఆల్ టైం టాప్ 6 ప్లేసులలో నిలిచిన ట్రెండ్ లను ఒకసారి గమనిస్తే
1) #8YrsForIHDookuduSensation – 676K**
2) #1YearForVeeraRaghavaRage – 530K
3) #12YearsOfBBYamadonga – 353K
4) #4YearsForCultTEMPER – 325K
5) #7YearsForIHDookudu – 243K
6) #4YrsForWarriorGonaGannaReddy – 226k
7) #3YrsOfTemperExplosion – 210K
మొత్తం మీద ఇవి ఇప్పటి వరకు జరిగిన ట్రెండ్స్ లో టాప్ ప్లేసులలో నిలిచిన ట్రెండ్స్…

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో నంబర్ 1 మూవీ గా నిలిచిన అరవింద సమేత….టోటల్ రన్ లో 98.9 కోట్ల షేర్ ని అందుకుంది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజే ఆల్ టైం రికార్డులను నమోదు చేసింది, సెకెండ్ వీక్ లో స్లో అవ్వడం వలన 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకోలేక పోయింది… మొత్తం మీద నటుడిగా ఎన్టీఆర్ ని మరో మెట్టు ఎక్కేలా చేసిన సినిమా ఇది అని చెప్పొచ్చు.

Leave a Comment