గాసిప్స్ న్యూస్

వీళ్ళ కష్టం ఊహాతీతం… అప్ డేట్ కోసం నేషనల్ వైడ్ ట్రెండ్!!

తమ ఆరాధ్య హీరో సినిమాల అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతలా ఎదురు చూస్తారో అందరికీ తెలిసిందే, టాలీవుడ్ లో రీసెంట్ టైం లో ఇలా అప్ డేట్స్ కోసం కళ్ళు ఖాయలు కాచేలా ఎదురు చూస్తున్న హీరోల్లో అందరికన్నా ముందు నిలిచే హీరో ఫ్యాన్స్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్. 2013 మిర్చి తర్వాత 6 ఏళ్లలో కేవలం 3 సినిమాలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్. బాహుబలి తో నేషనల్ స్టార్ అయినా కానీ..

అభిమానులు తమ ఫేవరేట్ హీరో సినిమాలు ఇయర్ కి ఒకటికి రెండు రిలీజ్ అవ్వాలని కోరుకుంటారు. ఇక్కడ 2 ఏళ్ళకి ఒక సినిమా రిలీజ్ అవుతూ రాగా ఈ ఇయర్ సాహో రిలీజ్ చేసిన ప్రభాస్ అప్ కమింగ్ మూవీ యు వి క్రియేషన్ బ్యానర్ లో రాధాకృష్ణ డైరెక్షన్ లో చేస్తుండగా…

ఆ సినిమా వచ్చే ఇయర్ సమ్మర్ లో రిలీజ్ అన్నారు. ప్రభాస్ పుట్టిన రోజు రీసెంట్ గా జరగగా ఆ పుట్టిన రోజున అయినా సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారేమో అని ఎదురు చూసిన ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశ ఎదురు అవ్వగా ఇప్పటి వరకు ఎలాంటి న్యూస్ రాక పోవడం తో సోషల్ మీడియా లో ఫ్యాన్స్ రెచ్చి పోయారు.

“#WeWantPrabhas20Update” హాష్ టాగ్ తో నాన్ స్టాప్ గా ట్వీట్స్ వేస్తూ ఆల్ మోస్ట్ 2 లక్షల రేంజ్ లో ట్వీట్స్ వేసి నేషనల్ వైడ్ ట్రెండ్ వేసి యువి క్రియేషన్ బ్యానర్ ని 1 లక్ష కి పైగా ట్వీట్స్ లో టాగ్ చేసినా కానీ ఎలాంటి ప్రయోజనం దక్కలేదు.  వారినుండి ఎలాంటి స్పందన లేక పోవడం తో ఫ్యాన్స్ మరింత చిరాకు పడుతున్నారు.

ఇప్పటి నుండి ప్రభాస్ ప్రతీ మూవీ పాన్ ఇండియా మూవీ నే అవ్వడంతో అన్నీ పెర్ఫెక్ట్ గా ఉంటెనే అప్ డేట్ ఉంటుంది అన్నది యూనిట్ ఇన్ సైడ్ వర్గాల టాక్. ఆ పెర్ఫెక్ట్ డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అనే ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూపులు కంటిన్యు అవుతూనే ఉన్నాయి. వీళ్ళ ని చూసి ఇలాంటి కష్టం మరే హీరో ఫ్యాన్స్ కి రాకూడదు అంటూ ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా జాలి పడుతున్నారు.

Leave a Comment