న్యూస్ రివ్యూ వీడియో

వెంకిమామ ట్రైలర్ రివ్యూ… అరాచకం!

విక్టరీ వెంకటేష్ అక్కినేని నాగ చైతన్య ల మల్టీ స్టారర్ వెంకిమామ భారీ అంచనాల నడుమ ఈ నెల 13 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే, కాగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు, ట్రైలర్ మాస్… ఊరమాస్ అనే రేంజ్ లో ఉందని చెప్పాలి. ముఖ్యంగా వెంకీ నాగ చైతన్య లు కలిసి ఉన్న సీన్స్ థియేటర్స్ లో దుమ్ము లేపే అవకాశం ఉంది.

ఇక ట్రైలర్ హైలెట్ విషయానికి వస్తే ఇద్దరు హీరోల స్క్రీన్ ప్రజన్స్, తర్వాత మాస్ ఎలిమెంట్స్ మేజర్ హైలెట్ అని చెప్పాలి, మాస్ కి ఓ రేంజ్ లో కిక్ ఇచ్చేలా ఉన్న కొన్ని ఫైట్ సీన్స్ తాలూకు చిన్న గ్లిమ్స్ ట్రైలర్ లోనే ఓ రేంజ్ లో పేలింది అని చెప్పొచ్చు.

ఇక కామెడీ ఎలిమెంట్స్ హీరోయిన్స్ తో హీరోల లవ్ ట్రాక్ కామెడీ గా వర్కౌట్ అయ్యేలా ఉందని ట్రైలర్ లో అర్ధం అవుతుంది, ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కి మరో హైలెట్ గా నిలవగా ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుందని చెప్పొచ్చు. ఎటొచ్చి మిలటరీ బ్యాగ్ డ్రాప్ తో ఉండే సీన్స్…

ఎలా ఉంటాయి అన్నది ప్రస్తుతానికి అయితే క్లారిటీ లేదు కానీ ఆ సీన్స్ అండ్ ఎపిసోడ్స్ కామన్ ఆడియన్స్ కి ఎంతవరకు కనెక్ట్ అవుతాయి అన్నదానిపై సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. అవి పెర్ఫెక్ట్ గా ప్రేక్షకులకు కనెక్ట్ అయితే ఈజీగా ఎంత పోటి ఉన్నా కానీ…

ఈ సినిమా అవలీలగా 50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవడం ఏమాత్రం కష్టం కాదనే చెప్పాలి. ఓవరాల్ గా ట్రైలర్ ఊహించినదానికన్నా ఓవర్ మాస్ గా ఉందని చెప్పొచ్చు. ఎమోషనల్ ఫ్యామిలీ మూవీ అని చెబుతున్నారు కాబట్టి ఆ ఎమోషనల్ సీన్స్ ఎలా ఉంటాయో అన్నది సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలనున్నాయి. మీరు ట్రైలర్ చూసి ఎలా ఉంది అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

Leave a Comment