గాసిప్స్ న్యూస్

వెంకీ నుండి రవితేజ…మళ్ళీ రవితేజ నుండి వెంకీ…ఏంటి సామి ఇది!!

ఒక్కో సారి ఒక సినిమా ఆఫర్ ఒకరి నుండి మరొకరికి వెళ్ళడం అన్నది కామన్ గా జరిగే విషయమే… కథ నచ్చకనో, డేట్స్ లేకనో… వేరే ఇబ్బందుల వలనో ఇలా కారణాలు ఏవైనా కావచ్చు కానీ అప్పుడప్పుడు కొన్ని సినిమాలు ఒకరి నుండి ఒకరికి వెళుతూ ఉంటాయి. ప్రస్తుతం ఇలాంటిదే మరొకటి టాలీవుడ్ లో జరుగుతుందని లేటెస్ట్ సమాచారం. ఓ రీమేక్ ఆఫర్ ఇద్దరు హీరోల చుట్టూ తిరిగుతూ కన్ఫాం కాలేక పోతుంది.

మలయాళం లో ఈ ఇయర్ సూపర్ డూపర్ హిట్ అయిన అయ్యప్పునం కోశియుం అనే సినిమా ను తెలుగు లో రీమేక్ చేయాలి అని ఫిక్స్ అయ్యారు. తెలుగు లో ముందు బాలయ్య ని మెయిన్ రోల్ కి అనుకున్నారు కానీ బాలయ్య నో చెప్పాడు.

ఇక తర్వాత బిజు మోహన్ రోల్ కి వెంకీ ని అలాగే ప్రుద్వీరాజ్ రోల్ కి రానా ని కన్ఫాం చేసినట్లే చేయగా ఎందుకనో సడెన్ గా వెంకీ ఈ సినిమా లో నటించడం లేదని వార్తలు రావడం మొదలు అయ్యాయి. వెంకీ ప్లేస్ లో రవితేజ ఆ రోల్ లో నటించబోతున్నారు అన్న వార్తలు…

గట్టిగానే ప్రచారం జరగగా రెమ్యునరేషన్ ఎక్కువ అడుగుతున్నాడు అన్న రూమర్స్ కూడా వినిపించాయి. కట్ చేస్తే కొన్ని రోజులకు మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా వార్తల్లో నిలవగా ఈ సారి రవితేజ కాకుండా సినిమా కి తిరిగి వెంకీ నే తీసుకోవాలి అని ట్రై చేస్తున్నారని సమాచారం. వెంకీ రానా ల కాంబినేషన్ అయితే ఫ్యామిలీ మల్టీ స్టారర్ కింద సినిమా కి…

మరింత క్రేజ్ వస్తుందని ప్లాన్ చేస్తున్నారట. దాంతో ఎలాగైనా వెంకీ ని ఒప్పించాలని చూస్తున్నారు అన్నది లేటెస్ట్ టాక్. మొత్తం మీద వెంకీ నుండి రవితేజ కి వెళ్ళినట్లే వెళ్ళిన ఈ సూపర్ హిట్ రీమేక్ తిరిగి మళ్ళీ ఇప్పుడు వెంకీ దగ్గరికే వచ్చింది. మరి ఫైనల్ గా వెంకీ కన్ఫాం చేస్తాడా లేక తిరిగి రవితేజ దగ్గరికి సినిమాను పంపుతాడా చూడాలి మరి…

Leave a Comment