న్యూస్

వెంకీ సూపర్….స్పీడ్…ఎన్ని రోజుల్లో దృశ్యం2 షూటింగ్ కంప్లీట్ చేసాడో తెలుసా?

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ రీసెంట్ గా మల్టీ స్టారర్ మూవీస్ తో మళ్ళీ సూపర్ కంబ్యాక్ ఇవ్వగా ఫ్యామిలీ ఆడియన్స్ లో వెంకీ రీచ్ ఏమాత్రం తగ్గలేదని ఆ సినిమాల విజయాలతో ప్రూవ్ అయ్యింది, ఇక ఇప్పుడు ఈ ఇయర్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్న వెంకటేష్ బాక్స్ ఆఫీస్ దగ్గర అసురన్ రీమేక్ నారప్ప తో ఆడియన్స్ ముందుకు రాబోతుండగా తర్వాత… వరుణ్ తేజ్ తో కలిసి చేస్తున్న సినిమా…

ఎఫ్ 3 తో ఆగస్టు లో మళ్ళీ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ గ్యాప్ లో ఎవ్వరూ ఊహించని విధంగా మరో సినిమా కమిట్ అవ్వడం ఆ సినిమాలో తన పార్ట్ షూటింగ్ ను మొత్తం కంప్లీట్ కూడా చేయడం జరిగింది ఇప్పుడు. ఆ సినిమా మరేదో కాదు…

రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ క్రేజ్ ను సొంతం చేసుకున్న దృశ్యం 2 సినిమా, మలయాళం లో వచ్చిన సీక్వెల్ డిజిటల్ లో సూపర్ హిట్ అవ్వడం తో తెలుగు రీమేక్ ను ఆ సినిమా డైరెక్టర్ జీతు జోసెఫ్ మొదలు పెట్టాడు. లాస్ట్ మంత్ ఈ సినిమాను అనౌన్స్ చేయగా…

మార్చ్ 15 నుండి రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టుకున్న ఈ సినిమా వెంకటేష్ పాత్ర షూటింగ్ కోసం 25 రోజుల డేట్స్ ను ఇచ్చాడు. రీసెంట్ గా సినిమా షూటింగ్ లో వెంకీ పాత్ర షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యిందని డైరెక్టర్ కన్ఫాం చేశాడు. కేవలం 25 రోజుల్లో ఆల్ మోస్ట్ 80% షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యిందట.

వెంకీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అవ్వగా మిగిలిన భాగం షూటింగ్ ఈ నెల ఎండ్ వరకు పూర్తీ అవుతుందట. సినిమాను ఇప్పుడు ఆడియన్స్ ముందుకు జూన్ నెలలో తీసుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ రేంజ్ స్పీడ్ తో సినిమా కంప్లీట్ అవ్వడం అంటే మామూలు రచ్చ కాదనే చెప్పాలి. ఇలానే అన్ని సినిమాల షూటింగ్ జరిగితే. ఇయర్ కి ఒక స్టార్ హీరో అవలీలగా 3-4 సినిమాలు చేయోచ్చు…

Leave a Comment