న్యూస్ రివ్యూ

వైల్డ్ డాగ్ మూవీ రివ్యూ-ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ వైల్డ్ డాగ్ ఆడియన్స్ ముందుకు రానే వచ్చింది, డిజిటల్ రిలీజ్ కి ఆఫర్స్ చాలా వచ్చినా కానీ నో చెబుతూ వచ్చిన టీం సినిమాను థియేటర్స్ లోనే ఎలాగైనా రిలీజ్ చేయాలనీ డిసైడ్ అవ్వగా ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ఎలా ఉంది, ఎంతవరకు అంచనాలను అందుకుంది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ…ముందుగా కథ పాయింట్ కి వస్తే… 2007 టైం లో హైదరాబాదులో జరిగిన గోకుల్ చాట్…

బాంబ్ బ్లాస్ట్ తర్వాత నేరస్తులను పట్టుకోవడానికి NIA వాళ్ళని రంగం లోకి దింపగా ఆ టీం హెడ్ అయిన వైల్డ్ డాగ్ నాగార్జున ఎలా కేస్ సాల్వ్ చేశాడు అన్నది సినిమా కథ పాయింట్… రియల్ ఇన్సిడెంట్స్ ని ప్రేరణ గా తీసుకుని రూపొందించిన ఈ సినిమా లో కింగ్ నాగార్జున…

పెర్ఫార్మెన్స్ పరంగా కుమ్మేశాడు. తన లుక్స్ కానీ యాక్షన్ సీన్స్ లో ఎనర్జీ కి కానీ ఏజ్ కి ఏమాత్రం సంభందం లేకుండా ఉండటం విశేషం. ఇక మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా తమ తమ రోల్స్ లో మెప్పించారు. బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. కొన్ని సీన్స్ కి ప్రాణం పోసింది.

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కొంచం నీరసం తెప్పించింది, కథ టేకాఫ్ అవ్వడానికి టైం పడుతుంది, 30 నిమిషాల తర్వాత కానీ మెయిన్ కథలోకి ఎంటర్ కారు, తర్వాత కొన్ని ఆసక్తి కరమైన సీన్స్ తో ఇంటర్వెల్ బాగా మెప్పించగా సెకెండ్ ఆఫ్ పడుతూ లేస్తూ కథ సాగినా మళ్ళీ క్లైమాక్స్ బాగా ముగియడం జరుగుతుంది… దాంతో అక్కడక్కడా బోర్ కొట్టినా సినిమా బాగుంది అనిపిస్తుంది.

డైరెక్టర్ సినిమా కథ లెంత్ తక్కువే పెట్టినా మరింత క్రిస్ప్ గా స్క్రీన్ ప్లే రాసుకోవాల్సింది. కానీ ఇలాంటి డిఫెరెంట్ అటెంప్ట్ ని తెలుగు లో ట్రై చేసినందుకు మెచ్చుకుని తీరాల్సిందే… కానీ మరింత శ్రద్ధ పెట్టి ఉంటె బాలీవుడ్ ఉరి లా సినిమా ఇంకా బాగా మెప్పించి ఉండేది. మొత్తం మీద ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే… నాగార్జున పెర్ఫార్మెన్స్, యాక్షన్ సీన్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అని చెప్పాలి.

ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్టాఫ్ టేక్ ఆఫ్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకోవడం, ట్విస్ట్ లు టర్న్ లు ఊహించే విధంగా ఉండటం, అలాగే కథ పాయింట్ కొంచం ఉరి, అంతకుముందు వచ్చిన బేబి లాంటి థ్రిల్లర్ మూవీస్ ని ఇన్స్పైర్ గా తీసుకున్నట్లు అనిపించడం లాంటి డ్రా బ్యాక్స్ కూడా ఉన్నాయి.

అయినా కానీ ఈ ఏజ్ లో ఇలాంటి ఎక్స్ పెరిమెంటల్ మూవీ చేసిన కింగ్ నాగార్జున అభినంది తీరాల్సిందే, తన ఎనర్జీ కోసం పక్కా చూడొచ్చు, అలాగే ఇలాంటి థ్రిల్లర్ యాక్షన్ మూవీస్ ఇష్టపడేవాళ్ళు కొంచం స్లో అయినా ఈ సినిమా ను కూడా ఇష్టపడే అవకాశం ఉంది, ఇలాంటి కొత్త తరహా మూవీ ని తెలుగు లో తెచ్చినందుకు ఈజీగా 3 స్టార్ రేటింగ్ ఇవ్వొచ్చు. థ్రిల్లర్ మూవీ లవర్స్ కొన్ని హికప్స్ ఉన్నా ఈ సినిమాను చూడొచ్చు.

Leave a Comment