టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

శింభు ఈశ్వరన్ టోటల్ కలెక్షన్స్…12 కోట్లకు అమ్మితే వచ్చింది ఇదీ!

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ సంక్రాంతి టైం లో భారీ పోటి ఏర్పడగా పోటి లో రిలీజ్ అయిన సినిమాల్లో తెలుగు లో చాలా వరకు హిట్ గా నిలిచాయి… ఇక కోలివుడ్ లో విజయ్ నటించిన మాస్టర్ మూవీ కలెక్షన్స్ పరంగా వీర విహారం చేసింది. అదే టైం లో పోటి లో నిలిచిన మరో మూవీ శింభు హీరోగా నటించిన ఈశ్వరన్ సినిమా. ఈ సినిమా పోటి లో తక్కువ థియేటర్స్ లోనే…

డీసెంట్ క్రేజ్ దృశ్యా 7.25 కోట్ల రేంజ్ బిజినెస్ ను మొత్తం మీద సొంతం చేసుకోగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ని సొంతం చేసుకోగా మొదటి వారం లో తమిళ్ లో 11 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా 18 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది.

సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ 12 కోట్ల దాకా అవ్వగా హిట్ అవ్వాలి అంటే 24 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకోవాల్సి ఉండగా మొత్తం మీద రన్ కంప్లీట్ అయ్యే టైం కి తమిళ్ లో ఈ సినిమా 13.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ను సాధించింది అని సమాచారం….

ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 22.1 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుందని అంటున్నారు. దాంతో మొత్తం మీద షేర్ సినిమా కి 11.2 కోట్ల దాకా వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుందట. తమిళనాడు లో ఆల్ మోస్ట్ 7.1 కోట్ల దాకా షేర్ ని సినిమా సాధించిందట. మొత్తం మీద బ్రేక్ ఈవెన్ కి చేరువగా వెళ్ళినప్పటికీ కూడా…

ఇటు తమిళనాడు లో అటు వరల్డ్ వైడ్ గా కూడా బ్రేక్ ఈవెన్ ను అందుకోలేక పోయింది ఈ సినిమా. అయినా చాలా వరకు బిజినెస్ ను రికవరీ చేయడం తో సినిమా మొత్తం మీద సెమీ హిట్ గా పరుగును బాక్స్ ఆఫీస్ దగ్గర ముగించింది అని చెప్పొచ్చు. పోటి లేకుండా ఉండి ఉంటే సినిమా అవలీలగా బ్రేక్ ఈవెన్ ను సొంతం చేసుకుని ఉండేది.

Leave a Comment