గాసిప్స్ న్యూస్

శ్రీదేవి సోడా సెంటర్ క్లైమాక్స్….అక్కడ నుండి కాపీ కొట్టారా!!

రీసెంట్ గా వచ్చిన సుధీర్ బాబు ఆనంది ల కాంబినేషన్ లో రూపొందిన లవ్ స్టొరీ శ్రీదేవి సోడా సెంటర్ సినిమా ఆడియన్స్ మనసు గెలుచుకుంది. సినిమా లో సుధీర్ బాబు ఆనంది ల పెర్ఫార్మెన్స్ కి అప్లాజ్ అదిరిపోయే రేంజ్ లో ఉండగా కీలక పాత్ర చేసిన సీనియర్ నరేష్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమా అంతా ఒకెత్తు క్లైమాక్స్ 20 నిమిషాల ఎపిసోడ్ మరో ఎత్తుగా చెప్పుకుంటున్నారు.

అప్పటి వరకు ఒక ఫ్లోలో వెళ్ళే సినిమా సడెన్ గా ఊహించని టర్న్ తీసుకుంటుంది, ఆ క్లైమాక్స్ కొందరికీ జీర్ణించుకోవడం కష్టం కానీ అలాంటివే కాకుండా ఈ మధ్య కాలంలో ఇలాంటి లవ్ స్టొరీ ల నేపధ్యంలో వచ్చిన సినిమాల్లో ఇలాంటి ట్రాజిక్ క్లైమాక్స్ ని కొన్ని సినిమాల్లో పెట్టారు.

ఈ సినిమా క్లైమాక్స్ కూడా కొంచం అలాంటి విధంగానే రాసుకున్నారు అనుకోవచ్చు కానీ సినిమా క్లైమాక్స్ ఒక సినిమా నుండి కాపీ కొట్టారు అంటూ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ ప్రచారం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ టైం లో నెట్ ఫ్లిక్స్ లో పావ కడైగల్ అనే మూవీ వచ్చింది.

నాలుగు డిఫెరెంట్ కథలను కలిపి తీసిన ఈ సినిమాలో సాయి పల్లవి మరియు ప్రకాష్ రాజ్ లు తండ్రి కూతుళ్ళుగా ఒక ఎపిసోడ్ ఉంటుంది. ఆ కథ చివర్లో ట్విస్ట్ షాకింగ్ గా అనిపిస్తుంది… అప్పటి వరకు ఒక ఫ్లోలో వెళ్ళే ఆ సినిమా కథ క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ ఆల్ మోస్ట్ అదే విధంగా ఇప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ లో…

వాడారు అంటూ సోషల్ మీడియా లో తెగ ప్రచారం చేస్తున్నారు, నిజానికి ఆ కథ తమిళనాడులో ఒకప్పుడు జరిగిన యాదార్ధ సంఘటన… శ్రీదేవి సోడా సెంటర్ వాళ్ళు కూడా అలాంటి ఇన్ స్పిరేషన్ తోనే ఈ కథను రాసుకున్నారేమో… కానీ ముందు ఆ సినిమా రావడం ఇప్పుడు ఈ సినిమా రావడం తో కాపీ అంటూ ప్రచారం జరుగుతుంది… మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో మేకర్స్ కే తెలియాలి.

Leave a Comment