గాసిప్స్ న్యూస్

షాకింగ్ న్యూస్: లూసిఫర్ రీమేక్ లో ఈ హైలెట్ సీన్ ఉండదట!!

మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ దగ్గర 10 ఏళ్ల తర్వాత సాలిడ్ కంబ్యాక్ ని సొంతం చేసుకుని తర్వాత వరుస కమిట్ మెంట్స్ తో దూసుకు పోతూ ఉండగా ఖైదీ నంబర్ 150, సైరా నరసింహా రెడ్డి లాంటి సినిమాల తర్వాత ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ ఈ సినిమా ను ఈ ఇయర్ ఎండ్ టైం కల్లా ఆడియన్స్ ముందుకు తీసుకు రావాలని ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత వరుస పెట్టి రెండు రీమేక్ సినిమాలను ఒప్పుకున్న మెగాస్టార్ అందులో ముందుగా మలయాళంలో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన మోహన్ లాల్ లూసిఫర్ సినిమా ను తెలుగు లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరు ముగ్గురు తెలుగు డైరెక్టర్స్ ని…

ఈ సినిమా రీమేక్ కోసం అనుకున్నా చివరికి తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా తెలుగు రీమేక్ భాద్యతలను తీసుకోగా స్క్రిప్ట్ చేంజెస్ వర్క్ ఆల్ మోస్ట్ ఫినిష్ కి రాగా అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకోబోతున్న ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ శాకిచ్చే న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది.

సినిమా ఒరిజినల్ వర్షన్ లో ప్రీ క్లైమాక్స్ టైం లో ఎవ్వరూ ఊహించని విధంగా హీరో పృద్వీరాజ్ స్పెషల్ క్యామియో ఉంటుంది అక్కడ, ఆ ఫైట్ సీన్స్ మోహన్ లాల్ ని హీరో ఎలివేట్ చేసే సీన్స్ అద్బుతంగా ఉండటంతో అవి అక్కడ ఓ రేంజ్ లో వర్కౌట్ అయ్యాయి. ఆ సీన్స్ ని తెలుగు లో ఏ హీరో నటిస్తారా అన్నది ఆసక్తిగా మారగా…

తెలుగు లో ఇప్పుడు ఆ సీన్స్ ని పెట్టడం లేదని అంటున్నారు. ఆ సీన్స్ లేకుండా కథ మొత్తం చిరు చుట్టూనే తిరిగేలా ప్లాన్ చేసుకున్నారని, లూసిఫర్ లో ఉన్నట్లు స్పెషల్ క్యామియో ఇందులో ఉండబోదని గట్టిగానే వార్తలు వినిపిస్తుంది, మరి ఆ సీన్స్ బదులు ఏ సీన్స్ ని రాసుకున్నారు, ఆ సీన్స్ ఎంతవరకు ఆడియన్స్ ను మెప్పిస్తాయి అన్నది సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది ఇక.

Leave a Comment