న్యూస్ స్పెషల్

షాకింగ్ రిజల్ట్ ఇచ్చిన 3వ పాట!! టాప్ 5 లిరికల్ వీడియో రికార్డ్స్!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ అల వైకుంఠ పురం లో సినిమా రిలీజ్ కి ఇంకా టైం ఉన్నా కానీ రెండు నెలల ముందు నుండే సినిమా లోని ఒక్కో పాటని రిలీజ్ చేస్తూ సినిమా పై బజ్ ఏమాత్రం తక్కువ కాకుండా చూసుకుంటున్నారు యూనిట్ వర్గాలు. మొదటగా రిలీజ్ అయిన రెండు పాటలు కూడా సూపర్ సక్సెస్ అయ్యాయు.

దాంతో పాటే లిరికల్ వీడియో ల పరంగా కూడా సరికొత్త రికార్డులను నమోదు చేయగా ఇప్పుడు సినిమా లోని మూడో పాట అయిన ఓ మై గాడ్ డాడీ సాంగ్ ని రీసెంట్ గా రిలీజ్ చేయగా అనుకున్న టైం కి గంటన్నర కి పైగా ఆలస్యంగా రిలీజ్ అవ్వడం తో…

ఓవరాల్ గా అనుకున్న రేంజ్ లో రీచ్ దక్కలేదు. దాంతో మొదటి 2 పాటల మాదిరిగా మూడో పాట కొత్త రికార్డులు అందుకోవడంలో విఫలం అవ్వగా ఓవరాల్ గా చూసుకుంటే టాలీవుడ్ లో లిరికల్ వీడియో ల పరంగా మాత్రం టాప్ 5 లో ఒకటిగా నిలిచి సంచలనం సృష్టించింది.

ఒకసారి లిరికల్ వీడియోల్లో మొదటి 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ సాధించిన పాటలను గమనిస్తే
?#RamulooRamulaa: 7.39 Mil
?#Samajavaragamana: 5.11 Mil
?#VachaadayyoSaami: 3.28 Mil
?#OMGDaddy: 3.21 Mil***
?#Chotibatein: 3.2 Mil
?#ThisIsMe: 3.15 Mil
ఇక ఎక్కువ లైక్స్ సాధించిన సాంగ్స్ ని గమనిస్తే
?#RamulooRamulaa: 315K Likes
?#Samajavaragamana: 312K Likes
?#VachaadayyoSaami: 189K Likes
?#ThisIsMe: 187K Likes
?#OMGDaddy: 172K Likes***
?#RangammaMangamma: 152K Likes
?#Peniviti: 150K Likes

ఇవీ మొత్తం మీద టాలీవుడ్ లో లిరికల్ వీడియో ల పరంగా మొదటి 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ ని అందుకున్న పాటలు. మూడో పాట ఆలస్యంగా రావడం, అందునా పోటి లో సరిలేరు నీకెవ్వరు టీసర్ కూడా రిలీజ్ అవ్వడం లాంటివి ఇంపాక్ట్ చూపింది, అయినా కానీ టాప్ 5 లో చోటు దక్కించుకుంది మూడో పాట.

Leave a Comment