గాసిప్స్ న్యూస్

షాకింగ్….లూసిఫర్ రీమేక్ డైరెక్టర్ మళ్ళీ చేంజ్!

మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కంబ్యాక్ ని ఖైదీ నంబర్ 150 తో సొంతం చేసుకోగా తర్వాత సైరా సినిమా తో మెప్పించినా సినిమా జానర్ దృశ్యా ఆశించిన విజయాన్ని అందుకోలేదు, తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికే సినిమాను రిలీజ్ చేయాల్సింది కానీ కరోనా వలన సినిమా పోస్ట్ పోన్ అయ్యి వచ్చే ఇయర్ సమ్మర్ రేసులో….

నిలిచిన విషయం తెలిసిందే, ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చేయాలనీ ఫిక్స్ అయిన సినిమా లూసిఫర్ తెలుగు రీమేక్, కానీ సినిమా రీమేక్ కథ కి తెలుగు లో తగ్గ మార్పులు జరగడం లేదని ముందుగా సాహో డైరెక్టర్ సుజిత్ ఈ సినిమా నుండి తప్పుకోగా…

తర్వాత సుజిత్ ప్లేస్ లో సీనియర్ డైరెక్టర్ వివి వినాయక్ వచ్చారు. వినాయక్ కూడా తన వంతుగా పలు మార్పులు చేర్పులు చేయగా ఫైనల్ ఔట్ పుట్ చిరు- చరణ్ లకు అంత బాగా అనిపించలేదని ఇప్పుడు వార్తలు శిఖారు చేస్తున్నాయి. అందువలనే చిరు లూసిఫర్ ప్లేస్ లో…

వేదాలం రీమేక్ ని ముందుకి తెచ్చారు అని వార్తలు వస్తుండగా ఇప్పుడు లూసిఫర్ రీమేక్ కి డైరెక్టర్ గా వేరే డైరెక్టర్ ను అనుకుంటున్నారని టాక్ గట్టిగా వినిపిస్తుంది, ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉండగా పవర్ స్టార్ తో సినిమా కోసం ఎదురు చూస్తున్న గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం ఖాళీగానే ఉండటం తో….

హరీష్ శంకర్ కి ఇప్పుడు లూసిఫర్ రీమేక్ తెలుగు మార్పులు చేర్పుల పని అప్పగించారు అని టాక్ వినిపిస్తుంది, హరీష్ శంకర్ కి రీమేక్ లను తెలుగు లో మంచి మార్పులతో మెప్పించగలరు అని ఇది వరకే గబ్బర్ సింగ్, గద్దల కొండ గణేష్ తో రుజువు అయింది. ఇప్పుడు ఈ వార్తలు నిజం అయితే లూసిఫర్ హరీష్ శంకర్ తనదైన కమర్షియల్ టచెస్ ఇవ్వడం ఖాయమని చెప్పొచ్చు. మరి ఇది నిజం అవుతుందో లేదో త్వరలో తేలనుంది…

Leave a Comment