న్యూస్ బాక్స్ ఆఫీస్

షాకింగ్: 32 కోట్ల ఊచకోత అప్పుడు…ఇప్పుడు పరిస్థితి ఇది…!!

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి ల కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమా లవ్ స్టొరీ… లాస్ట్ ఇయరే ఆడియన్స్ ముందుకు రావాల్సిన ఈ సినిమా అప్పటి నుండి పోస్ట్ పోన్ అవుతూ రాగా ఈ ఇయర్ సమ్మర్ లో కచ్చితంగా వస్తుంది అనుకుంటే రిలీజ్ కి వారం ముందు సినిమా సెకెండ్ వేవ్ వలన పోస్ట్ పోన్ అవ్వగా అప్పటి నుండి సినిమా కి…

సాలిడ్ డైరెక్ట్ రిలీజ్ ఆఫర్స్ వచ్చినా కానీ నో చెప్పిన టీం సినిమాను ఎట్టి పరిస్థితులలో థియేటర్స్ లో రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అవ్వగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చే శుక్రవారం సినిమాను బరిలోకి దింపబోతున్నారు. కానీ సినిమా కి బిజినెస్ మాత్రం అనుకున్న రేంజ్ లో ఇప్పుడు…

జరిగే పరిస్థితులు కనిపించడం లేదని తెలుస్తుంది… ఈ ఇయర్ సమ్మర్ టైం లో సినిమా కి జరిగిన బిజినెస్ రేంజ్ నాగ చైతన్య కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ అనిపించే రేంజ్ లో జరిగింది… 30 కోట్ల నుండి 32 కోట్ల రేంజ్ లో బిజినెస్ ఆల్ మోస్ట్ క్లోజ్ అయ్యే టైం కి…

సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన సినిమా రిలీజ్ ను ఆపేశారు… కానీ ఇప్పుడు ఆంధ్రలో ఇంకా టికెట్ రేట్లు సెట్ కాక పోవడం 50% ఆక్యుపెన్సీనే ఉండటం లాంటివి సినిమా బిజినెస్ పై తీవ్రంగానే ఇంపాక్ట్ చూపుతూ ఉండగా సినిమా కి ఇప్పుడు ఓవరాల్ గా 18 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగేలా ఉందంటూ ట్రేడ్ వర్గాలలో టాక్ వినిపిస్తుంది. ఫైనల్ లెక్కలు….

అతి త్వరలోనే ఏరియాల వారిగా బయటికి రానుండగా ఈ బిజినెస్ మందు అనుకున్న బిజినెస్ కన్నా చాలా తక్కువే అని చెప్పాలి కానీ సినిమా బాగుంటే కచ్చితంగా లాంగ్ రన్ ని సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది, మరి నాగ చైతన్య మజిలీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చేస్తున్న లవ్ స్టొరీ తో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తాడో చూడాలి.

Leave a Comment