న్యూస్ బాక్స్ ఆఫీస్

సందీప్ కిషన్ లాస్ట్ 4 మూవీస్ డే 1 కలెక్షన్స్…హైయెస్ట్ నుండి డౌన్ కి!!

యంగ్ హీరో సందీప్ కిషన్ టాలీవుడ్ లో తనకంటూ ఓ చిన్న మార్కెట్ ని ఏర్పరుచుకోవడానికి చాలా కాలంగా కష్టపడుతున్నాడు కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర కన్సిస్టంట్ గా కలెక్షన్స్ రాబట్టడం విషయంలో మాత్ర్రం నిరాశ కలిగేలానే సినిమాలను ఎంచుకుంటున్నాడు… రీసెంట్ గా వచ్చిన గల్లీ రౌడీ సినిమా సందీప్ కిషన్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిలీజ్ ను తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుని రిలీజ్ అయింది….

కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా 61 లక్షల రేంజ్ కలెక్షన్స్ తోనే సరిపెట్టుకుంది… ఒక సారి కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ వస్తే తర్వాత సినిమాల నుండి ఇంకొంచం గ్రోత్ చూస్తూ ఉంటారు హీరోలు అందరూ, అలాంటి గ్రోత్ చూపెట్టే సినిమాలను కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది…

సందీప్ కిషన్ ఈ సినిమా కన్నా ముందు లాస్ట్ 3 మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే… రెండేళ్ళ క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర మేజర్ హిట్ గా నిలిచిన సినిమా నిను వీడని నీడను నేనే సినిమా ఫస్ట్ డే 90 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది….

ఇది అప్పటికి సందీప్ కిషన్ కెరీర్ లో టాప్ ఓపెనింగ్స్ ని అందుకున్న సినిమాగా నిలిచింది, కానీ తర్వాత చేసినా తెనాలి రామకృష్ణ సినిమా కేవలం 55 లక్షల రేంజ్ ఓపెనింగ్స్ తోనే సరిపెట్టుకుంది, ఇక ఆ తర్వాత చేసిన ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా 76 లక్షల రేంజ్ లో ఓపెనింగ్స్ ను మొదటి రోజు సొంతం చేసుకుంది… ఇక ఇప్పుడు గల్లీ రౌడీ సినిమా..

61 లక్షలకే సరిపెట్టుకుంది. మొత్తం మీద కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకున్న తర్వాత ఏమాత్రం కన్సిస్టంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర హోల్డ్ చేయలేక పోయాడు సందీప్ కిషన్, గల్లీ రౌడీ కి బాగా ప్రమోట్ చేసినా ఓపెనింగ్స్ యావరేజ్ గానే వచ్చాయి. మరి ఫ్యూచర్ లో అయినా మంచి ప్లానింగ్ తో సినిమాల విషయంలో సందీప్ కిషన్ గ్రోత్ ని సొంతం చేసుకోవాలని విష్ చేద్దాం..

Leave a Comment