గాసిప్స్ న్యూస్

సడెన్ ట్విస్ట్…టక్ జగదీష్ OTT లో….రేటు ఎంతంటే!!

నాచురల్ స్టార్ నాని హీరోగా రీసెంట్ టైం లో కొంచం గ్యాప్ తర్వాత పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో చేసిన సినిమా టక్ జగదీష్… సినిమా టీసర్ రిలీజ్ నుండే మంచి హైప్ ను మెయిన్ టైన్ చేస్తున్న ఈ సినిమా నాని కెరీర్ లోనే కొత్త రికార్డులను నమోదు చేసే ఛాన్స్ ఉందని అందరూ అనుకుంటూ ఉండగా సినిమా సమ్మర్ రిలీజ్ అవ్వాల్సింది కానీ సెకెండ్ వేవ్ వలన రిలీజ్ ఆగిపోయింది.

ఇక సినిమా సెకెండ్ వేవ్ తర్వాత థియేటర్స్ లో రావడానికి తెగ ట్రై చేస్తుంది కానీ పరిస్థితులు ఏమాత్రం కలిసి రావడం లేదు, ఆంద్రలో తగ్గించిన టికెట్ రేట్లతో ఇప్పుడు సినిమాల బిజినెస్ లు రికవరీ అవ్వాలి అంటే ఒక్కో సినిమా 50 రోజుల పాటు హౌస్ ఫుల్ కలెక్షన్స్ ని సాధించాల్సి ఉంటుంది.

అలాంటి రోజులు ఎప్పుడో ఒకటో రెండో సినిమాలకే జరుగుతాయి కానీ అన్ని సినిమాలకు జరగవు. ఇక అప్పటి వరకు కొత్త సినిమాల రిలీజ్ లు కూడా ఆగవు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సినిమా రిలీజ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేక టీం ఎదురు చూపులు చూస్తున్నారు.

మరో పక్క రిలీజ్ డేట్ పోస్టర్స్ వచ్చినా మేకర్స్ అవి రూమర్స్ అని కొట్టేయగా ఇప్పుడు టాలీవుడ్ ట్రేడ్ లో కొత్త వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఆ వార్తల ప్రకారం సినిమా మళ్ళీ తిరిగి డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవుతుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా కి అల్టిమేట్ అనిపించే విధంగా 40 కోట్లకు పైగా రేటు ఆఫర్ వచ్చిందని అంటున్నారు. దాంతో పాటు కుదిరితే…

ఒక వారం థియేట్రికల్ రిలీజ్ కి కూడా ఒప్పుకుంటారని టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఏవి నిజం అవుతాయి అన్నది తెలియాల్సి ఉండగా మేకర్స్ వీటి పై ఇప్పటి వరకు అయితే ఎలాంటి రూమర్స్ అని స్టేట్ మెంట్స్ అయితే ఇవ్వక పోవడం తో సినిమా డిజిటల్ వైపు అడుగులు వేయడం ఖాయమేమో అన్న భావన కలిగిస్తుంది. మరి ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Leave a Comment