న్యూస్ బాక్స్ ఆఫీస్

సడెన్ ట్విస్ట్…నాని Vs నాగ చైతన్య…ఎవరు తగ్గుతారో మరి!!

సమ్మర్ మొత్తం ఫుల్ గా మూవీస్ ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి…లాస్ట్ ఇయర్ నుండి హోల్డ్ లో ఉన్న సినిమాలు అన్నీ కూడా ఈ ఇయర్ ఒకటి తర్వాత ఒకటి రాబోతుండగా టెస్ట్ ట్రైల్ గా భావించిన క్రిస్టమస్ సంక్రాంతి సీజన్స్ కుమ్మేయడంతో నిర్మాతలలో ధైర్యం పెరిగి సినిమాలను ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యారు. దాంతో ఇప్పుడు పోటి ఎక్కువ అయ్యేలా ఉంది.

సమ్మర్ కి ఇప్పటికే పోటి తీవ్ర తరం కాగా ఆల్ రెడీ అనౌన్స్ చేసిన డేట్స్ కే మరో సినిమాలు పోటిగా వస్తూ ఉండటం షాకింగ్ గా మారింది, నాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ టక్ జగదీష్ ను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 16 న రిలీజ్ చేయబోతున్నామని రీసెంట్ గా…

అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దాంతో ఒక వారం పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ రన్ మూవీ కి దక్కుతుంది అనుకుంటే ఇప్పుడు సడెన్ గా మరో క్రేజీ మూవీ పోటి కి వచ్చింది. యువ సామ్రాట్ నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ ని కూడా అదే రోజున ఇప్పుడు…

రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ తో అనౌన్స్ చేశారు. దాంతో ఇప్పుడు ఈ రెండు సినిమాలు కూడా ఏప్రిల్ 26 నే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. 2019 లో కూడా నాగ చైతన్య మజిలీతో నాని జెర్సీ తో ఒక వారం గ్యాప్ లోనే పోటి పడ్డారు, రెండూ బాగా ఆడాయి కానీ మజిలీ ఎక్కువ వసూళ్లు సాధించింది. కానీ ఈ సారి మాత్రం రెండు సినిమాలు ఓకే రోజున…

పోటి పడుతూ ఉండటం తో ఇప్పుడు ఎవరైనా తగ్గి రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేసుకుంటారా లేక పోటి లో అలాగే ఉంటారా అన్నది ఆసక్తి కరంగా మారింది. లవ్ స్టొరీ పై మంచి అంచనాలు ఉన్నాయి. మరో పక్క నాని కొంత గ్యాప్ తర్వాత టక్ జగదీష్ తో పక్కా కమర్షియల్ మూవీ చేస్తున్నాడు. మరి ఫైనల్ గా ఏమవుతుందో అన్నది త్వరలోనే తెలబోతుంది.

Leave a Comment