గాసిప్స్ న్యూస్

సప్తగిరి పాన్ ఇండియా మూవీ…బడ్జెట్ చూసి టాలీవుడ్ మొత్తం షాక్!

తెలుగు ఇండస్ట్రీలో చిన్న చితకా రోల్స్ చేస్తూ కమెడియన్ గా మంచి పేరు సొంతం చేసుకుని, అద్బుమైన కామెడీ టైమింగ్ తో మెప్పించి అతి తక్కువ టైం లో స్టార్ కమెడియన్ గా మారిన సప్తగిరి తనకంటూ స్పెషల్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు, ఇక తర్వాత హీరోగా కూడా మారిన సప్తగిరి అడపాదడపా హీరోగా సినిమాలను చేసినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏవి కూడా కలెక్షన్స్ ని సాధించ లేక పోయాయి. దాంతో కుదిరినప్పుడు హీరోగా లేక పొతే…

మిగిలిన టైం లో కమెడియన్ గా కెరీర్ ని కొనసాగిస్తున్న సప్తగిరి లాస్ట్ ఇయర్ అందరికీ షాక్ ఇస్తూ కొత్త సినిమా అనౌన్స్ మెంట్ చేశాడు, కొత్త సినిమాని కేవలం టాలీవుడ్ వరకే పరిమితం చేయకుండా ఈ సారి ఏకంగా పాన్ ఇండియా లెవల్ లో రూపొందించ బోతున్నాడని అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు.

సూర్యాస్ అనే డైరెక్టర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కి ఎయిట్ అనే డిఫెరెంట్ టైటిల్ ని కన్ఫాం చేశారు, ఇక సినిమా తెలుగు తో పాటు తమిళ్, కన్నడ మరియు హిందీ భాషల్లో రూపొందబోతుందని అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు సప్తగిరి. ఇక సినిమా కి గాను తన కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో…

సినిమా ను తెరకెక్కించ బోతున్నారని సమాచారం… ఈ సినిమా కోసం ఏకంగా 30 కోట్ల రేంజ్ బడ్జెట్ ని కేటాయించ బోతున్నారట. ఇది మట్టుకు మామూలు విషయం కాదనే చెప్పాలి, తెలుగు లో హిట్ అయితే మహా అయితే 3 నుండి 5 కోట్ల రేంజ్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్న సప్తగిరితో పాన్ ఇండియా సినిమానే షాక్ అంటే మళ్ళీ ఆ సినిమా కోసం ఏకంగా…

30 కోట్ల రేంజ్ బడ్జెట్ ని కేటాయించడం అన్నది మరింత షాకింగ్ అనే చెప్పాలి, రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ థ్రిల్లర్ మూవీ అన్ని భాషల్లో డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ వర్కౌట్ అయితే బడ్జెట్ రికవరీ అవుతుంది అన్న నమ్మకంతో ఇంత బడ్జెట్ పెట్టారు అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి. వచ్చే ఇయర్ ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది.

Leave a Comment