గాసిప్స్ న్యూస్

సమ్మర్ ఔట్…ఇక మాస్టర్ వచ్చేది అప్పుడే!!

లాక్ డౌన్ వలన రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమా లు అన్ని పోస్ట్ పోన్ అయ్యి ఎప్పుడు రిలీజ్ అవుతాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది, అన్నీ సజావుగా సాగి ఉంటే తెలుగు లో క్రేజీ సినిమా లు సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేవి, అలాగే తమిళ్ లో టాప్ హీరో విజయ్ నటించిన మాస్టర్ ఎప్పుడో ఏప్రిల్ 9 న రిలీజ్ అవ్వాల్సింది, లాక్ డౌన్ వలన రిలీజ్…

ఆగిపోగా లాక్ డౌన్ అయిన వెంటనే వస్తుంది అంటున్నారు కానీ ప్రస్తుతం తమిళనాడు లో కేసులు అస్సలు తగ్గడం లేదు, మరింత సమయం పట్టే అవకాశం ఎక్కువగా ఉంది, మినిమమ్ 2 మూడు నెలలు అయితే టైం పడుతుందని అంచనా వేస్తున్నారు. అది కూడా ఫుల్ క్లారిటీ లేదనే చెప్పాలి.

ఇలాంటి టైం లో సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సిన మాస్టర్ సినిమా ఇప్పుడు ఎట్టి పరిస్థితులలో కూడా సమ్మర్ ఎండ్ టైం కి కూడా వచ్చేలా లేదు, దాంతో విజయ్ తన కి రీసెంట్ గా అచ్చొచ్చిన బెస్ట్ డేట్ కి థియేటర్స్ లో భారీ ఎత్తున సందడి చేయాలని ఫిక్స్ అయ్యాడట.

రీసెంట్ టైం లో విజయ్ నటించిన సినిమాలు అన్నీ దీపావళి కి రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపాయి, మెర్సల్, సర్కార్ మరియు బిగిల్ సినిమా లు దీపావళి కి వచ్చి పాత రికార్డుల బెండు తీశాయి, ఇప్పుడు విజయ్ తిరిగి ఆ సీజన్ నే టార్గెట్ చేయాలి అని ఫిక్స్ అయ్యాడు.

ఈ ఇయర్ దీపావళి పై అజిత్ కుమార్ జెండా వేసినప్పటికీ… ఆ సినిమా షూటింగ్ ఆగిపోవడం తో పోస్ట్ పోన్ అయ్యింది, దాంతో ఆ డేట్ ప్రస్తుతానికి ఖాళీ గా ఉండగా ఇప్పట్లో థియేటర్స్ తెరిచేలా లేక పోవడం తెరిచినా జనాలు మునుపటిలా వచ్చేలా లేక పోవడం తో దీపావళికి రావడమే బెటర్ అని విజయ్ అనుకుంటున్నట్లు సమాచారం…

Leave a Comment