న్యూస్ రివ్యూ వీడియో

సరిలేరునీకెవ్వరు టీసర్ రివ్యూ…సూపర్ స్టార్ అరాచకం!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు.. దూకుడు ఆగడు తర్వాత పెర్ఫెక్ట్ మాస్ మూవీ చేయని మహేష్ బాబు ఎట్టకేలకు ఇప్పుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సరిలేరు నీకెవ్వరు అంటూ మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ తో వచ్చేశాడు. భారీ అంచనాల నడుమ సినిమా అఫీషియల్ టీసర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది, అంచనాలను ఏమాత్రం తక్కువ కానీ విధంగా టీసర్ దుమ్ము దుమారం చేసింది అని చెప్పొచ్చు.

సినిమా కథ పాయింట్ ఏంటో ఇది వరకే అనిల్ రావిపూడి చెప్పిన విషయం తెలిసిందే, ఆర్మీ మేజర్ తన ఊరికి వస్తున్న క్రమం లో హీరోయిన్ తో పరిచయం ఊరికి వచ్చిన తర్వాత కొన్ని సమస్యలను ఎలా సరిచేశాడు అన్నది స్టొరీ పాయింట్. టీసర్ లో అన్నీ కవర్ చేయకున్నా ఫ్యాన్స్ కోరుకునే అంశాలు మాత్రం పెర్ఫెక్ట్ గా…

పెట్టాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి, మాస్ సీన్స్, మహేష్ పవర్ ఫుల్ డైలాగ్, అండ్ ఎక్స్ లెంట్ స్క్రీన్ ప్రజన్స్ టీసర్ కి మెయిన్ హైలెట్ అవ్వగా మహర్షి కి యావరేజ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించి ఈ సారి అంచనాలను అందుకుంటాను అంటూ చెప్పిన దేవి శ్రీ ప్రసాద్…

అనుకున్నట్లే మాట నిలబెట్టుకున్నాడు అని చెప్పాలి. బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుందని చెప్పొచ్చు. ఇనీషియల్ ఇంప్రెషన్ ప్రకారం సినిమా టీసర్ ఫ్యాన్స్ అంచనాలను అందుకుంది, కామన్ ఆడియన్స్ ని కూడా మెప్పించింది. ఇది సంక్రాంతికి సినిమా కి అల్టిమేట్ ప్లస్ పాయింట్ గా మారబోతుంది.

ఇక బాక్స్ ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తె… అవలీలగా మరో 100 కోట్లు అందుకునే కెపాసిటీ సినిమా కి ఉందని చెప్పొచ్చు. రేసులో ఇతర సినిమాల రిజల్ట్ ని బట్టి లెక్క మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది. మీరు కూడా టీసర్ చూసి ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

Leave a Comment