న్యూస్ బాక్స్ ఆఫీస్

సరిలేరు నీకెవ్వరు@డే 3 ఓపెనింగ్స్….సూపర్ స్టార్ రాంపేజ్!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్స్ ఆఫీస్ దగ్గర 2 రోజుల్లో నే అల్టిమేట్ కలెక్షన్స్ తో దుమ్ము లేప గా సినిమా మూడో రోజు స్లో డౌన్ అయింది, కొత్త సినిమా పోటి లో ఉండటం, సండే నుండి మండే కి రావడం తో ఆ ఇంపాక్ట్ ఓపెనింగ్స్ పై స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పాలి.

సినిమా మూడో రోజు ఓపెనింగ్స్ ఓవరాల్ గా రెండో రోజు తో పోల్చుకుంటే 30% టు 35% వరకు డ్రాప్ అయ్యాయి. ఇది కామన్ అనే చెప్పాలి, అందునా కొత్త సినిమా పోటి లో ఉంది కాబట్టి ఈ మాత్రం డ్రాప్స్ కామన్, కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోలకు సినిమా…

అడ్వాన్స్ బుకింగ్స్ జోరు అందుకున్న నేపధ్యంలో సినిమా రోజు ముగిసే సరికి మళ్ళీ సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఓవరాల్ గా సినిమా ప్రస్తుతం ఉన్న డ్రాప్స్ ని బట్టి చూస్తె 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు.

ఇక సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ బాగున్నాయి కాబట్టి గ్రోత్ ని బట్టి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి మొత్తం మీద మూడో రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ 5.5 కోట్ల రేంజ్ కి వెళ్ళే అవకాశం ఉంది, ఇంకా జోరు ఎక్కువ ఉంటె ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.

ఇక సినిమా అమెరికాలో ప్రీమియర్స్ అలాగే 2 రోజుల కలెక్షన్స్ తో 1.6 మిలియన్ మార్క్ ని అందుకోగా ఓవరాల్ గా మహేష్ కెరీర్ లో 7 వ 1.5 మిలియన్ మార్క్ ని అందుకున్న సినిమా గా నిలిచి సంచలనం సృష్టించింది. ఇక 3 వ రోజు ముగిసే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి.

Leave a Comment