న్యూస్ బాక్స్ ఆఫీస్

సరిలేరు నీకెవ్వరు డే 2 కలెక్షన్స్…వీర లెవల్ భీభత్సం!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా రెండో రోజు అల వైకుంఠ పురంలో టీం తో అగ్రిమెంట్ వలన రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ అయిన 1000 థియేటర్స్ నుండి 40% ఆ సినిమా కి ఇచ్చేయగా మిగిలిన థియేటర్స్ లో సినిమా…

రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటి లో పరుగును కొనసాగించగా అల్టిమేట్ కలెక్షన్స్ తో జోరు చూపుతూ దూసుకు పోయింది సినిమా, సినిమా రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఓవరాల్ గా 75% కి పైగా ఆక్యుపెన్సీ తో రన్ అవ్వగా…

ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చే సరికి 90% టు 95% వరకు ఆక్యుపెన్సీ తో రన్ అయింది సినిమా. దాంతో రెండో రోజు కూడా సినిమా ఇప్పుడు సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది, సినిమా రెండో రోజు ఇప్పుడు 9 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవచ్చు.

ఇక పూర్తీ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అన్నీ అనుకున్నట్లు ఉంటె లెక్క 10 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక సినిమా మొత్తం మీద రెండో రోజు వరల్డ్ వైడ్ గా 11 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకునే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి.

ఓవరాల్ గా రెండో రోజు కొత్త సినిమా నుండి తీవ్ర పోటి ఎదురు అయినా అల్టిమేట్ గా హోల్డ్ చేసిన సరిలేరు నీకెవ్వరు ఇక మూడో రోజు నుండి సంక్రాంతి సెలవులు వారం పాటు ఉంటాయి కాబట్టి మరింత జోరు గా కలెక్షన్స్ ని సాధించి బిజినెస్ ని అందుకునే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి. ఇక 2 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Leave a Comment