న్యూస్ బాక్స్ ఆఫీస్

సరిలేరు నీకెవ్వరు డే 2 స్టేటస్…మైండ్ బ్లోయింగ్ హోల్డ్!!

సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి ల సెన్సేషనల్ సరిలేరు నీకెవ్వరు మొదటి రోజు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో ఊచకోత కోయగా రెండో రోజు కొత్త సినిమా అల వైకుంఠ పురంలో సినిమా ఉండటం తో ముందు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం 40% థియేటర్స్ ని ఆ సినిమా కి ఇచ్చేశారు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 600 వరకు థియేటర్స్ లో రన్ అవుతుంది.

కాగా సినిమా రెండో రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ లెవల్ లో హోల్డ్ చేసిందని చెప్పొచ్చు. థియేటర్స్ సంఖ్య తగ్గడం పోటిలో కొత్త సినిమా ఉన్నా కానీ ఓవరాల్ గా ఈ సినిమా రెండో రోజు మినిమమ్ 75% కి తగ్గని ఆక్యుపెన్సీ తో మొదటి 2 షోలను ఓవరాల్ గా పూర్తీ చేసుకుంది.

ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల టికెట్ సేల్స్ కూడా ఆల్ మోస్ట్ అయిపోయాయి అని చెప్పాలి, దాంతో రెండో రోజు సినిమా సాలిడ్ కలెక్షన్స్ తో హోల్డ్ చేయడం ఖాయమని చెప్పొచ్చు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని చూస్తుంటే సినిమా రెండో రోజు 8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవడం ఖాయం.

ఇక పూర్తీ ఈవినింగ్ అండ్ నైట్ షోల తో పాటు ఎక్స్ ట్రా షోల లెక్కలను బట్టి ఈ లెక్క ఎంత పెరుగుతుంది అన్నది చెప్పగలం, ఓవరాల్ గా చాలా సినిమాల రెండో రోజు కలెక్షన్స్ ని ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు తక్కువ థియేటర్స్ లోనే హోల్డ్ చేసి పోటి లో కూడా సాధించబోతుంది.

ఇక బిజినెస్ లో చాలా మొత్తం మొదటి రోజే వెనక్కి రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు రెండో రోజు సాధించే కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ సగానికి పైగా బిజినెస్ ని రికవరీ చేయబోతుందని చెప్పాలి. ఇది నిజంగానే ఊచకోత అని చెప్పాలి. ఇక రోజు ముగిసే సరికి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో మరో ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం…

Leave a Comment