న్యూస్ బాక్స్ ఆఫీస్

సరిలేరు నీకెవ్వరు డే 3 కలెక్షన్స్…మళ్ళీ కొట్టాడు సామి!!

సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే రేంజ్ లో హోల్డ్ చేస్తూ దూసుకు పోతుంది, సినిమా మూడో రోజు సోమవారం అవ్వడం తో తొలి 2 షోలకు డ్రాప్స్ 35% కన్నా ఎక్కువే రాగా తిరిగి సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు తేరుకుని మంచి హోల్డ్ ని సాధించి రోజుని ఘనంగా ముగించబోతుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో..

ఓవరాల్ గా ఇప్పుడు 5 కోట్ల మార్క్ ని అధిగమించడం ఖాయం అవ్వగా 5.5 కోట్ల రేంజ్ కి కూడా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. మూడో రోజు ఇతర మూవీస్ వలన థియేటర్స్ కోల్పోయిన సినిమా మొత్తం మీద ఉన్న వాటిలో బాగానే హోల్డ్ చేసిందని చెప్పాలి.

ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అన్ని చోట్లా అనుకున్నట్లే ఉండగా మొత్తం మీద 3 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటి లో కూడా 5.5 కోట్ల రేంజ్ లో షేర్ అంటే సినిమా సాలిడ్ గా హోల్డ్ చేసినట్లే అని చెప్పాలి. ఇక ఓవర్సీస్ లో కూడా దుమ్ము లేపుతున్న సినిమా అక్కడ 2 మిలియన్ వైపు దూసుకు పోతుంది.

మొత్తం మీద మూడు రోజున వరల్డ్ వైడ్ గా సినిమా 6 కోట్ల నుండి 6.3 కోట్ల రేంజ్ లో షేర్ ని టోటల్ గా అందుకోవచ్చు. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇప్పుడు 60 కోట్ల మార్క్ ని అధిగమించబోతున్నాయి. 100 కోట్ల టార్గెట్ చూసి పోటి లో కష్టం అనిపించినా…

మూడు రోజుల్లోనే 60% టార్గెట్ ని రికవరీ చేయడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇక 4 వ రోజు నుండి అసలు సిసలు సంక్రాంతి సెలవులు మొదలు అవుతున్నాయి కాబట్టి సినిమా జోరు మరింత పెరిగే అవకాశం ఉంది, ఇక 3 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

Leave a Comment