న్యూస్ బాక్స్ ఆఫీస్

సరిలేరు నీకెవ్వరు డే 4 ఓపెనింగ్స్…అసలు రచ్చ ఇప్పుడు మొదలు!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తూ దూసుకు పోతుంది, సినిమా మూడు రోజుల్లోనే సాలిడ్ గా బిజినెస్ లో చాలా మొత్తాన్ని వెనక్కి తీసుకురాగా సినిమా ఇప్పుడు అసలు సిసలు పండగ సెలవుల్లో అడుగు పెట్టింది, ఈ రోజు భోగి పండగ నుండి మరో 2 రోజుల పాటు బాక్స్ ఆఫీస్ కళకళలాడుతూ ఉంటుంది.

ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి 2 షోలకు కేవలం 10 నుండి 15% శాతం లోపు డ్రాప్స్ మాత్రమె సొంతం చేసుకోగా అన్ని సెంటర్స్ లో అల్టిమేట్ హోల్డ్ తో రన్ అవుతూ ఉంది. ఇక సినిమా ఈ రోజు నుండి..

రెండు తెలుగు రాష్ట్రాలలో 500 కి పైగా థియేటర్స్ లో రన్ కానుంది, దాంతో కలెక్షన్స్ స్టడీ గా ఉండటమే కాదు పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పాలి. ప్రస్తుతం ఉన్న ఓపెనింగ్స్ సాలిడ్ గా ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ కూడా అల్టిమేట్ అనిపించే విధంగా కొనసాగుతున్నాయి.

దాంతో ప్రస్తుతం ఉన్న ట్రెండ్ దృశ్యా సినిమా అవలీలగా 7 కోట్లకి తగ్గని షేర్ ని 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకోవచ్చు. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల గ్రోత్ ని బట్టి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి లెక్క ఎక్కడి దాకా వెళుతుంది అన్నది చెప్పలేం కానీ… అన్నీ అనుకున్నట్లు జరిగితే…

కచ్చితంగా 8.5 కోట్లకి పైగానే వెళ్ళే అవకాశం ఉంది… పండగ టైం లో పోటి లో ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే అది మామూలు విషయం కాదు. ఇక సినిమా ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుండగా మొత్తం మీద 4 వ రోజు కలెక్షన్స్ తో బిజినెస్ ని అందుకోవడానికి మరింత ముందుకు వెళ్ళబోతుంది.

Leave a Comment