న్యూస్ బాక్స్ ఆఫీస్

సరిలేరు నీకెవ్వరు డే 4 కలెక్షన్స్…సూపర్ స్టార్ వీరంగం!!

సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషనల్ సరిలేరు నీకెవ్వరు బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు రోజుల్లో 62 కోట్ల షేర్ ని అందుకోగా నాలుగో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర భోగి పండగ హాలిడే ను ఓ రేంజ్ లో వాడుకున్న ఈ సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో రోజుని ఘనంగా ముగించబోతుంది. సినిమా 4 వ రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు…

మొత్తం మీద 75% వరకు ఆక్యుపెన్సీ తో రన్ అవ్వగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చే సరికి 85% మార్క్ ని టచ్ చేసింది, కొన్ని సెంటర్స్ అయితే ఏకంగా 90% వరకు ఆక్యుపెన్సీ తో రన్ అయ్యాయి. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కూడా…

అన్ని సెంటర్స్ లో అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం అద్బుతంగా ఉన్నాయి, ఇక ఎక్స్ ట్రా షోలు కూడా అనుకున్న రేంజ్ లో ఉండే అవకాశం ఉండటం తో మొత్తం మీద 4 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో సరిలేరు నీకెవ్వరు సినిమా మినిమమ్ 8 కోట్ల నుండి 8.5 కోట్ల రేంజ్ లో…

కలెక్షన్స్ ని ఇప్పుడు అందుకోవడం పక్కాగా కనిపిస్తుంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు మినిమమ్ 9 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవచ్చు, పోటి తీవ్రంగా ఉన్న టైం లో ఇలాంటి ఓపెనింగ్స్ ని అందుకోవడం అంటే మామూలు విషయం కాదు, ఇక సినిమా 4 వ రోజు కలెక్షన్స్ తో…

బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 70 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించబోతుంది, దాంతో బిజినెస్ లో మొత్తం మీద 70% రికవరీ ని కేవలం 4 రోజుల్లో నే సాధించబోతుంది సినిమా. ఇక 4 వ రోజు అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎ విధంగా ఉంటాయో చూడాలి. అఫీషియల్ కలెక్షన్స్ రిపోర్ట్స్ వచ్చిన వెంటనే అప్ డేట్ చేస్తాం…

Leave a Comment