న్యూస్ బాక్స్ ఆఫీస్

సరిలేరు నీకెవ్వరు డే(10), అల వైకుంఠ పురంలో డే(9), ఎంత మంచి వాడవురా డే(6) కలెక్షన్స్!!

సంక్రాంతి సెలవులు పూర్తీ అయ్యాయి… అన్ని సినిమాలు తమ తమ రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించి బాక్స్ ఆఫీస్ ను బాగానే షేక్ చేశాయి. ముఖ్యంగా తెలుగు బిగ్గీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర కనక వర్షం కురిసేలా కలెక్షన్స్ ని సాధించి ఇండస్ట్రీ రికార్డులతో దుమ్ము దుమారం చేశాయి. ఇక అన్ని సినిమాలు అఫీషియల్ గా వర్కింగ్ డే లోకి సోమవారం ఎంటర్ అవ్వగా రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ..

ముందుగా రజినీ దర్బార్ సినిమా ఫ్లో సెలవుల్లోనే గాడి తప్పగా వర్కింగ్ డే కి వచ్చే సరికి మరింత నీరుగారి పోయింది. సినిమా 12 వ రోజు మహా అయితే 8 నుండి 10 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చని చెప్పాలి. ఇక మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా… బాక్స్ ఆఫీస్ దగ్గర 10 వ రోజులో…

ఎంటర్ అవ్వగా సోమవారం అయినా పర్వాలేదు అనే రేంజ్ లో హోల్డ్ చేసింది. సినిమా ఈ రోజు ఓపెనింగ్స్ ని బట్టి 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటె అందుకోవచ్చు అలాగే మించవచ్చు కూడా…

ఇక అల్లు అర్జున్ అల వైకుంఠ పురం లో సోమవారం అయినా జోరు తగ్గలేదు, కొన్ని మాస్ సెంటర్స్ లో స్లో అయినా ఓవరాల్ గా జోరు కంటిన్యు చేయగా ఈ రోజు సినిమా 4 కోట్లకి తగ్గని కలెక్షన్స్ ని అందుకోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతకు మించి ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉందట.

ఇక కళ్యాణ్ రామ్ ఎంత మంచి వాడవురా వర్కింగ్ డే లో స్లో డౌన్ అయ్యింది, 5 వ రోజు తో పోల్చితే 50% కి పైగా డ్రాప్స్ ఉండగా ఓవరాల్ గా ఈ రోజు సినిమా 25 లక్షల నుండి 30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చని చెప్పొచ్చు. మరి అన్ని సినిమాల అఫీషియల్ కలెక్షన్స్ రిపోర్ట్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Leave a Comment