న్యూస్ బాక్స్ ఆఫీస్

సరిలేరు నీకెవ్వరు తమిళ్ డబ్ 5 డేస్ కలెక్షన్స్…హోల్డ్ చేసిందిగా!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ తో పాటు టెలివిజన్ బ్లాక్ బస్టర్ గా కూడా నిలవగా సినిమా రిలీజ్ అయిన 10 నెలల తర్వాత డబ్బింగ్ వర్షన్ ని రీసెంట్ గా తమిళ్ లో రిలీజ్ చేశారు… సినిమాను డైరెక్ట్ సినిమాల రేంజ్ లో ఏకంగా 220 థియేటర్స్ లో రిలీజ్ చేయగా…

సినిమా కి మొదటి రోజే మంచి టాక్ లభించింది, అక్కడ మహేష్ కి మంచి క్రేజ్ ఉండటం తో జనాలు కూడా ఉన్నంతలో అన్ని అంశాల నడుమ కూడా పర్వాలేదు అనిపించే విధంగా థియేటర్స్ కి వస్తూ ఉండగా మొదటి రోజు ఎక్కువగా అక్కడ ఫ్యాన్స్ చూడగా సినిమాకి…

ఫస్ట్ డే 10 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ దక్కగా వీకెండ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా థియేటర్స్ కి రాలేదు దాంతో కలెక్షన్స్ గ్రోత్ లేదు కానీ ఉన్నంతలో 20 లక్షల రేంజ్ లో వీకెండ్ ని ముగించగా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో కూడా సినిమా అదే విధంగా…

హోల్డ్ చేస్తూ కలెక్షన్స్ ని సాధిస్తూ ఉందని తెలుస్తుంది, మొత్తం మీద సోమ వారం అండ్ మంగళవారం రెండూ రోజులు కలిపి మరో 10 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయని అంటున్నారు, అంటే శని ఆదివారాల రేంజ్ లో సినిమా వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేసినట్లు లెక్క అని అనుకోవాలి. మొత్తం మీద 5 రోజులకు గాను సినిమా ఇప్పుడు…

30 లక్షల రేంజ్ లో గ్రాస్ ని సొంతం చేసుకుందని అంటున్నారు. కానీ సినిమా సాధించిన బిజినెస్ లెక్కలు ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఆ వివరాలు మొదటి వారం పూర్తీ అయ్యే టైం కి తెలిసే అవకాశం ఉంది, మొత్తం మీద వీక్ డేస్ హోల్డ్ చూస్తుంటే సినిమా కి లాంగ్ రన్ దక్కే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

Leave a Comment