న్యూస్ బాక్స్ ఆఫీస్

సరిలేరు నీకెవ్వరు తమిళ్ లో టాక్…డే 1 కలెక్షన్స్ ఓపెనింగ్స్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి ల కాంబినేషన్ లో ఈ ఇయర్ సంక్రాంతి బరిలో భారీ ఎత్తున రిలీజ్ అయిన సెన్సేషనల్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్స్ ఆఫీస్ దగ్గర ఊరమాస్ అనిపించే విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే, అల వైకుంఠ పురంలో ఊహకందని జోరు చూపినా కానీ మహేష్ సరిలేరు నీకెవ్వరు కూడా స్ట్రాంగ్ హోల్డ్ ని రన్ పూర్తీ అయ్యే వరకు కొనసాగించింది.

తర్వాత టెలివిజన్ లో టెలికాస్ట్ అయినప్పుడు కూడా సాలిడ్ విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా రీసెంట్ గా తమిళ్ లో డబ్ వర్షన్ థియేట్రికల్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. కాగా సినిమాను అక్కడ సుమారు 220 థియేటర్స్ లో భారీగా రిలీజ్ చేశారు. మామూలు టైం లో అయితే పరిస్థితులు మరింత మెరుగ్గా ఉండేవి కానీ…

కోవిడ్ టైం లో థియేటర్స్ ని ఓపెన్ చేశారు కాబట్టి ఆ ఇంపాక్ట్ ఇంకా కొనసాగుతుంది, కానీ టాక్ పరంగా మాత్రం సినిమాకి అక్కడ కూడా మంచి టాక్ లభిస్తుంది అని చెప్పాలి, లిమిటెడ్ గానే జనాలు థియేటర్స్ కి వెళుతున్నా కానీ సినిమా కి మాత్రం…

చూసిన వాళ్ళలో పర్వాలేదు బాగుంది అనిపించే రేంజ్ లో టాక్ ని వినిపిస్తూ ఉండటం విశేషం అని చెప్పొచ్చు. ఇక టాక్ పరంగా బాగానే ఉన్నా కానీ జనాలు చాలా లిమిటెడ్ గానే థియేటర్స్ వైపు అడుగులు వేశారు, ఓవరాల్ గా 220 థియేటర్స్ లో 50% ఆక్యుపెన్సీ తో రిలీజ్ అయినా కానీ సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర…

10-12 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సాధించే విధంగా ఓపెన్ అయ్యి ఉంటుంది అని అంటున్నారు. రీసెంట్ గా అక్కడ దీపావళి టైం లో రిలీజ్ అయిన రెండు కొత్త సినిమాలు మొదటి రోజు కలిపి 1.2 కోట్ల మేర కలెక్షన్స్ ని అందుకున్నాయట. ఆ లెక్కతో చూస్తె డబ్ మూవీ కి ఇలాంటి ఓపెనింగ్స్ ఇప్పుడు గొప్పే అని చెప్పాలి. ఇక అఫీషియల్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

Leave a Comment