న్యూస్ బాక్స్ ఆఫీస్

సరిలేరు నీకెవ్వరు నైజాం డే 1…ఇండస్ట్రీ రికార్డులు గల్లంతు!!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ లెక్కలు తేలాల్సి ఉంది, ఇక సినిమా మేజర్ ఏరియాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఏరియా అయిన నైజాం లో మొదటి రోజు ఆల్ టైం రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకుంది, మొదటి రోజు ఇక్కడ అల్టిమేట్ బుకింగ్స్ ఉండగా సినిమా 7 కోట్ల రేంజ్ కి తగ్గని కలెక్షన్స్ ని…

మినిమమ్ అందుకుంటుంది అని భావించినా అంచనాలను కూడా మించేసిన సినిమా ఫస్ట్ డే ఏకంగా 8 కోట్ల మార్క్ ని కూడా దాటేసి ఏకంగా 8.67 కోట్ల షేర్ ని మొదటి రోజు నైజాంలో అందుకుని సంచలనం సృష్టించింది. ఓవరాల్ గా నైజాం లో ఇది…

పాన్ ఇండియా మూవీస్ ని పక్కకు పెడితే ఆల్ టైం హిస్టారికల్ రికార్డ్ అనే చెప్పాలి. ఇక పాన్ ఇండియన్ మూవీస్ ని కూడా కలుపుకుని చూస్తె ఏకంగా ఆల్ టైం టాప్ 3 ప్లేస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా నిజంగానే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది అని చెప్పాలి.

నైజాం లో ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన టాప్ సినిమాలను ఒకసారి గమనిస్తే
?#Saaho – 9.41Cr
?#Baahubali 2- 8.9Cr
?#SarileruNeekkevvaru – 8.67Cr??
?#SyeRaa- 8.10Cr
?#Maharshi – 6.38Cr
?#Baahubali1 – 6.32Cr
ఇవి ప్రస్తుతానికి నైజాం ఏరియా లో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన టాప్ మూవీస్.. సరిలేరు నీకెవ్వరు సినిమా కి నైజాం ఏరియా లో మొదటి రోజు…

325 కి పైగా థియేటర్స్ దక్కాయి. టికెట్ హైక్స్ ఎక్స్ ట్రా షోల అడ్వాంటేజ్ ని కూడా వాడుకుని మొదటి రోజు సంచలన కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. మిగిలిన సినిమాలను మహర్షి తప్పితే 400 కి పైగానే థియేటర్స్ మొదటి రోజు దక్కాయి. ఇక మిగిలిన ఏరియాల కలెక్షన్స్ లెక్కలు తేలాల్సి ఉంది.

Leave a Comment