న్యూస్ బాక్స్ ఆఫీస్

సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ డే కలెక్షన్స్…..హ్యుమంగస్ కలెక్షన్స్!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి ల లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అల్టిమేట్ లెవల్ లో కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపింది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కి ముందు రోజు వరకు 65% వరకు బుకింగ్స్ ని సొంతం చేసుకోగా రిలీజ్ రోజు మార్నింగ్ అండ్ నూన్ షోల సమయానికి 80% ని క్రాస్ చేసింది, ఇక సినిమా…

ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చే సరికి 90% వరకు దూసుకు పోయింది, కొన్ని సెంటర్స్ 100% ఆక్యుపెన్సీ ఉంది, ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టి సినిమా ఫస్ట్ డే 28 కోట్లు క్రాస్ చేయడం ఖాయమని చెప్పొచ్చు.

ఇది టాలీవుడ్ లో పాన్ ఇండియా మూవీస్ ని పక్కకు పెడితే మిగిలిన హీరోల సినిమాల్లో ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనర్ అని చెప్పొచ్చు. ఇక ఫైనల్ కౌంట్ 30 కోట్ల కి పైగా ఉండటం కూడా ఆల్ మోస్ట్ ఖాయమని, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో డ్రాస్టిక్ డౌన్ ఫాల్ ఉంటె తప్పితే ఇది కన్ఫాం అని అంటున్నారు.

ఇక ఓవర్సీస్ ప్రీమియర్ షోలతో 760K డాలర్స్ ని వసూల్ చేసిన సినిమా 1 మిలియన్ మార్క్ ని మిస్ అయింది, కానీ డే 1 కలెక్షన్స్ తో ఆ మార్క్ ని అందుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మొదటి రోజు కి గాను 36 కోట్లకు పైగా షేర్ ని అందుకోవడం ఖాయమని అంటున్నారు.

మరి ఫైనల్ లెక్క ఎంతవరకు వెళుతుంది అన్నది ఆఫ్ లైన్ పూర్తీ టికెట్ సేల్స్ లెక్కలు అలాగే లేట్ నైట్ షోల టికెట్ సేల్స్ ని బట్టి చెప్పగలం. మొత్తం మీద మహేష్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న సరిలేరు నీకెవ్వరు సినిమా బిజినెస్ లో చాలా వరకు ఫస్ట్ డే నే రికవరీ చేయబోతుందని చెప్పాలి. ఇక అఫీషియల్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Leave a Comment